Telangana Rains Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం దక్షిణాదిపై కంటే ఉత్తరాదిపై తీవ్ర ప్రభావం కన్పిస్తోంది. ఈ ఏడాది రుతుపవనాల ప్రభావంతో ఆశించిన మేర వర్షపాతం నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటి వరకూ 36 శాతం వర్షపాతం లోటు కన్పిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు కన్పిస్తున్నాయి. సాధారణ వర్షపాతం కంటే 30-36 శాతం లోటు కన్పిస్తోంది రెండు రాష్ట్రాల్లో. తెలంగాణలో ఇప్పటి వరకూ 36 శాతం లోటు స్పష్టంగా కన్పిస్తోందని ఐఎండీ వెల్లడించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి వర్షాలు పడ్డాయి. మోస్తరు వర్షపాతం ఒకట్రెండు ప్రాంతాల్లో నమోదు కాగా భారీ వర్షపాతం దాఖలాలు ఎక్కడా లేవు. అత్యధిక శాతం వర్షపాతం లేని ప్రాంతాల్లో ఉన్నాయి.
సూర్యాపేట జిల్లా చిలుకూరులో 5, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 4, కొత్తగూడెం జిల్లా చంద్రుగుండాలో 3, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో 3, కోదాడలో 3, మోతిలో 3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 2, జనగావ్ జిల్లా కొడలకండ్లలో2, ఖమ్మం జిల్లా ఎంకూరులో 2, అశ్వారావుపేటలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదంతా గత వారం నమోదైన వర్షపాతం. సాధారణంగా ఈ సమయంలో రెండు మూడ్రోజుల్లో నమోదయ్యే వర్షపాతం వారం రోజుల వ్యవధిలో పడుతోంది.
ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. అదే సమయంలో గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణవైపుకు వీస్తుండటంతో రానున్న మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి అంటే జూలై 12వ తేదీన ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చు. రేపు, ఎల్లుండి ఉరుములు , మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం సూచించింది.
ఇక జూలై 12 నుంచి 5 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాల హెచ్చరిక ఉండటంతో ఇప్పటి వరకూ ఉన్న 36 శాతం వర్షపాతం లోటు తీరవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.
Also read: RS Praveen Kumar: ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook