MP Kotha Prabhakar Reddy: ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై కత్తితో దాడి.. పొట్టపై భాగంలో గాయం

MP Kotha Prabhakar Reddy Health Updates: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉండగా.. ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆయన.. దౌల్తాబాద్ మండలంలో ప్రచారంలో బిజీ ఉండగా.. ఈ దాడి చోటు చేసుకుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 30, 2023, 03:39 PM IST
MP Kotha Prabhakar Reddy: ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై కత్తితో దాడి.. పొట్టపై భాగంలో గాయం

MP Kotha Prabhakar Reddy Health Updates: ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సూరంపల్లిలో ప్రభాకర్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో పాస్టర్‌ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వస్తుండగా ఎంపీపై దట్టని రాజు అనే వ్యక్తి కత్తి దాడికి పాల్పడ్డాడు. పొట్టపై భాగంలో గాయాలు అవ్వగా.. బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మొదట గజ్వేల్‌లోని ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. నారాయణఖేడ్‌ సభకు వెళ్తుండగా మంత్రి హరీశ్‌రావుకు సమాచారం అందడంతో వెంటనే గజ్వేల్‌ ఆసుపత్రికి వెళ్లారు. ఎంపీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబసభ్యులతో ఫోన్‌ ద్వారా అడిగి తెలుసుకున్నారు.

కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా మంత్రి  టి.హరీష్ రావు ఖండించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హనీయం అని.. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని అన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం బీఆర్ఎస్  పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికిత్స  అందించేందుకు సికింద్రాబాద్ యశోధ ఆస్పత్రికి తరలించామని.. కత్తిపోటుతో కడుపులో గాయాలయ్యాయని తెలిపారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కేడర్ ఎలాంటి  ఆందోళనలకు గురికావద్దని అన్నారు. అధైర్య పడవద్దని.. ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనేకోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు. 

కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని గవర్నర్ తమిళ సై ఖండించారు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో మెదక్ ఎంపీ, బీఆర్‌ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరమన్నారు. ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, ప్రచారకుల భద్రతను నిర్ధారించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ని ఆదేశించారు. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల కోసం శాంతియుత, సురక్షితమైన వాతావరణాన్ని నిర్వహించడం చాలా అవసరం అని అభిప్రాయపడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 

దాడికి పాల్పడిన వ్యక్తిని మండలం మిడిదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన జి.రాజుగా గుర్తించారు. ఎంపీతో కరచాలనం చేసేందుకు వచ్చి.. కత్తితో పొడిచి హత్యయత్నం చేశాడు. వెంటనే అక్కడ ఉన్న కార్యకర్తలు తెరుకొని.. అతన్ని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు. గాయపడిన ఎంపీ ప్రభాకర్ రెడ్డిని  గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ  చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉన్నందున  మెరుగైన చికిత్స గురించి హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి  తరలించారు. హత్యయత్నం చేసిన జి.రాజుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత  తెలిపారు.

Also Read: Nagam Janardhan Reddy: కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్.. నాగం జనార్థన్‌ రెడ్డి రాజీనామా  

Also Read: Virat Kohli: ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్.. విరాట్ కోహ్లీ డకౌట్.. వీడియో చూశారా..!   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News