Nayanthara: ధనుష్ పై పెరుగుతున్న నెగిటివిటీ.. ఈ 3 సెకండ్స్ కోసం రూ.10కోట్లా?

Nayanthara vs Dhanush:   ప్రస్తుతం నయనతార విషయంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పై నెగెటివిటీ పూర్తిస్థాయిలో పెరిగిపోయింది. తాజాగా నయనతారకు ధనుష్ లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. దీనిపై మండిపడుతూ నయనతార ఒక నోట్ వదిలింది.  ఇక ఆ వీడియో ఏంటని నెటిజెన్స్ ఆరా తీయగా జస్ట్ షూటింగ్ పార్ట్ మాత్రమే ఉండడంతో ధనుష్ పై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. 

Written by - Vishnupriya | Last Updated : Nov 17, 2024, 12:04 PM IST
Nayanthara: ధనుష్ పై పెరుగుతున్న నెగిటివిటీ.. ఈ 3 సెకండ్స్ కోసం రూ.10కోట్లా?

Nayanthara controversy video clip: సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్గా నిలిచింది. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ అదే స్టేటస్ ను  అనుభవిస్తోంది.

Add Zee News as a Preferred Source

ఇకపోతే ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి కష్టపడి ఈ స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలోని ఈమె కష్టాన్ని గుర్తించిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈమెపై డాక్యుమెంటరీ తీస్తోంది. ఈ నేపథ్యంలోనే డాక్యుమెంటరీ కి సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. 

అయితే ట్రైలర్లో ధనుష్ నిర్మించి , నయనతార హీరోయిన్గా నటించిన నానుం రౌడీ దాన్ మూవీలో మూడు సెకండ్ల నిడివి ఉన్న క్లిప్ 1 అందులో యాడ్ చేయడం జరిగింది. తన అనుమతి లేకుండా నయనతార తన సినిమాలోని భాగాన్ని తన డాక్యుమెంటరీలో పెట్టుకుందనే కోపంతో రూ.10 కోట్లు ఇవ్వాలి అని లీగల్ నోటీసులు పంపించారు ధనుష్. 

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నయనతార.. మీరు మీ తండ్రి, సోదరుడి సహాయంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. కానీ నేను నా రెక్కల కష్టంతో ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం నాకు సహాయపడుతుంటే మీరు మాత్రం మీ కక్ష సాధింపులు మొదలుపెట్టారు అంటూ పోస్ట్ పెట్టింది. అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం నయనతార ధనుష్ చుట్టూ రెండేళ్లు తిరిగినా ఆయన అంగీకరించలేదన్నట్లు నయనతార తెలిపింది.

ఇకపోతే నయనతార తీసుకున్న ఆ క్లిప్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అందులో అసలు విజయ్ సేతుపతి, నయనతార ఒక బార్ లో ఉన్న చిన్న క్లిప్పు అది కూడా మూడు సెకండ్లు మాత్రమే. 

 

ఇది చూసిన నెటిజన్స్ దీనికోసమా మీరు రూ.10 కోట్లు డిమాండ్ చేస్తోంది అంటూ ధనుష్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ప్రస్తుతం ధనుష్ పై విపరీతంగా నెగెటివిటీ పెరిగిపోతుందని చెప్పవచ్చు.

Read more: APSRTC: బస్సు ప్రయాణికులు ఎగిరి గంతేసే వార్త.. ఇక నుంచి జర్నీలో 25 శాతం రాయితీ.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News