MP Raghunandan Rao - BJP: శుభలేఖ పై ఎంపీ క్యాండిడేట్ ఫోటో.. కేసు నమోదు..

MP Raghunandan Rao - BJP: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రవవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్ధులు చేసే చిన్న పొరపాట్లపై కూడా ఎలక్షన్ కమిషనర్ కన్నెర్ర జేస్తోంది. తాజాగా ఓ శుభలేఖపై ఎంపీ ఫోటో ముద్రించడంపై వివాదాం నెలకొంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 22, 2024, 08:15 AM IST
MP Raghunandan Rao - BJP: శుభలేఖ పై ఎంపీ క్యాండిడేట్ ఫోటో.. కేసు నమోదు..

MP Raghunandan Rao - BJP: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి  543 లోక్ సభ నియోజక వర్గాలకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.  అందులో 102 లోక్ సభ సీట్లకు  తొలి విడత ఎన్నికలు  ఇప్పటికే మొదటి దశ పోలింగ్‌ పూర్తయింది. మరోవైపు మిగతా ఆరు దశల్లో ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో అభ్యర్ధులు చేసే ప్రతి చిన్న విషయాన్ని కూడా గమనిస్తూ ఉంది.  ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగా.. శుభలేఖ పత్రికపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్ధి రఘునందన్ రావు ఫోటో ముద్రించడంపై కేసు నమోదు చేసినట్టు మెదక్ జిల్లా కౌడిపల్లి ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపారు. మహ్మద్ నగర్ గేట్ తండాకు చెందిన నునావత్ సురేష్‌ నాయక్ ఈ నెల 28న తన తమ్ముడు మదన్ పెళ్లి సందర్భాన్ని పురస్కరించుకొని పెళ్లి పత్రికల్లో రఘునందన్ రావు ఫోటో ముద్రించారు.

అంతే కాకుండా వారి ఓట్లే పెళ్లి కానుకగా అంటూ కార్డు పై ముద్రించారు. ఈ విషయమై ఫ్లయింగ్ స్క్వాడ్ టీం (ఎఫ్‌ఎస్‌టీ) అధికారి సిరిగే చంద్రయ్య ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. ఈ మేరకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 18వ లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న దేశ వ్యాప్తంగా అన్ని లోక్ సభ స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ నిర్వహించున్నారు. 

Also Read: Harish Vs Revanth: కొడంగల్‌లో ఓడితే రేవంత్‌ రెడ్డి ఎందుకు సన్యాసం తీసుకోలే? హరీశ్‌ రావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x