Munugode Bypoll: నర్సయ్య గౌడ్ జంప్.. రవికుమార్ గౌడ్ ఇన్.. మునుగోడులో జబర్దస్త్ పాలిటిక్స్

Munugode Bypoll:  మునుగోడులో గంటగంటకు రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఒక పార్టీ మరో పార్టీకి షాకిస్తే.. వెంటనే మరో పార్టీ మరో షాక్ ఇస్తోంది.బూర టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే పల్లె రవికుమార్ గౌడ్ కారు పార్టీలో చేరిపోయారు

Written by - Srisailam | Last Updated : Oct 15, 2022, 04:32 PM IST
  • మునుగోడులో వలసల జోరు
  • కారెక్కిన పల్లె రవికుమార్
  • బూర కు టీఆర్ఎస్ కౌంటర్
Munugode Bypoll:  నర్సయ్య గౌడ్ జంప్.. రవికుమార్ గౌడ్ ఇన్.. మునుగోడులో జబర్దస్త్ పాలిటిక్స్

Munugode Bypoll:  మూడు ఎత్తులు.. ఆరు వ్యూహాలు. ఇది మునుగోడు నియోజకవర్గంలో పార్టీల పరిస్థితి. తెలంగాణలో అత్యంత కీలకంగా మారిన ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి నామినేషన్ల పర్వం కూడా ముగియడంతో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. వ్యూహాలకు పదును పెడుతున్నాయి. దీంతో మునుగోడులో గంటగంటకు రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఒక పార్టీ మరో పార్టీకి షాకిస్తే.. వెంటనే మరో పార్టీ మరో షాక్ ఇస్తోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ వస్తుందా అని మునుగోడు జనాలు ఎదురుచూస్తున్నారు. బలమైన నేతలను గుర్తించి తమ వైపు లాగేస్తున్నాయి పార్టీలు. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామాలు జరుగుతున్నాయి.

కీలకమైన ఉపఎన్నిక వేళ టీఆర్ఎస్ కు రాజీనామా చేసి షాకిచ్చారు బూర నర్సయ్య గౌడ్. రేపోమాపో ఆయన బీజేపీలో చేరబోతున్నారు. బూర జంప్ తో కలవరపడిన కారు పార్టీ వెంటనే కౌంటర్ స్టెప్ వేసింది. నర్సయ్య గౌడ్ కు కౌంటర్ గా మరో గౌడ్ నేతను పార్టీలో చేర్చుకుంది. బూర టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే పల్లె రవికుమార్ గౌడ్ కారు పార్టీలో చేరిపోయారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో పల్లె రవికుమార్ దంపతులు గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక్కడో మరో ట్విస్ట్ ఉంది. బూర తర్వాత బీజేపీలో చేరేది ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకరేనని శనివారం ఉదయం నుంచి మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే కర్నె ప్రభాకర్ నేతృత్వంలో టీఆర్ఎస్ చేరారు పల్లె రవికుమార్ గౌడ్. జర్నలిస్టు నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు రవికుమార్. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన సతీమణి కళ్యాణి  చండూరు ఎంపీపీగా కొనసాగుతున్నారు. పల్లె దంపతులకు పార్టీ కండువా కప్పి  టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. ఉద్యమ కాలం నుంచి మాతో కలిసి పని చేసిన పల్లె రవికుమార్ తమ పార్టీ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందన్నార కేటీఆర్.

కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ గెలుపు కోసం టిఆర్ఎస్ లో చేరేందుకు ముందుకు వచ్చిన పల్లె రవికుమార్ కు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. పాత మిత్రుడు పల్లె రవికుమార్ కి కచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని మంచి రాజకీయ అవకాశాలను పార్టీ కల్పిస్తుందని హామీ ఇచ్చారు. అన్ కండిషనల్ గా  టీఆర్ఎస్ పార్టీలో చేరామని తెలిపారు  పల్లె రవికుమార్.  చండూరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలన్నప్రజల కోరికను కేటీఆర్ దృష్టికి వెళ్లానని చెప్పారు. ఇందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారని రవికుమార్ వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.

మునుగోడు నియోజకవర్గంలో గౌడ్ సామాజికవర్గం ఓట్లే అత్యధికంగా ఉన్నాయి. దాదాపు 39 వేల గౌడ ఓటర్లున్నారు. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉండటంతో అన్ని పార్టీలు వాళ్లపై ఫోకస్ చేశాయి. బీజేపీ పెద్దలే నేరుగా రంగంలోకి దిగి బూరతో మాట్లాడారని తెలుస్తోంది. బూర జంప్ తో తమకు నష్టం కల్గుతుందనే అంచనాకు వచ్చిన టీఆర్ఎస్ వెంటనే రంగంలోకి దిగి.. పల్లె రవికుమార్ ను పార్టీలోకి చేర్చుకుందని తెలుస్తోంది. నియోజకవర్గంలోని బీసీ ఓటర్లలో పల్లెకు మంచి పట్టు ఉంది. దీంతో బూర పార్టీ మారితే జరిగే నష్టాన్ని పల్లెతో పూడ్చుకునేలా కారు పార్టీ స్కెచ్ వేసిందని టాక్. 

Read Also: Telangana TDP: చంద్రబాబుపై బీఆర్ఎస్ ఎఫెక్ట్.. కొత్త చీఫ్ తో తెలంగాణలో  సైకిల్ చక్రం తిరిగేనా?

Read Also: Boora Narsaiah Goud: బూర నర్సయ్య గౌడ్ కు బీజేపీ బంపరాఫర్! వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసేది అక్కడే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News