Nayeem Follower Seshanna: ఎన్ కౌంటర్ లో హతమైన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ నయీమెద్దీన్ ప్రధాన అనుచరుడు ఎట్టకేలక పోలీసులకు చిక్కాడు. నయీం ఎన్ కౌంటరైన ఆరున్నర ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు శేషన్న. నయీం ఆదేశాలతో ఎన్నో హత్యలు చేసిన నర హంతకుడు శేషన్నను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులోనికి తీసుకున్నారు. 9 MM పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు చిక్కకుండాఅజ్ఞాతంలో ఉన్న శేషన్న కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ల్యాండ్ సెటిల్ మెంట్లు చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్తపేటలోనే ఓ హోటల్ లో డీల్ చేస్తున్న శేషన్నను పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. పోలీసుల దగ్గర మాత్రమే ఉండే 9 ఎంఎం పిస్టల్ శేషన్న దగ్గర ఉండటం పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ పిస్టల్ అతనికి ఎలా వచ్చిందన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఆర్మ్స్ యాక్ట్ కేసులో శేషన్న అరెస్ట్ చూపెట్టనున్నారు పోలీసులు.
షాద్ నగర్ శివార్లలోని మిలీనియం టౌన్ షిప్ లో 2016 ఆగస్టు 8న జరిగిన ఎన్ కౌంటర్ లో నయీం చనిపోయాడు. ఆ సమయంలోనే శేషన్న ఎక్కడన్నది తెలియలేదు. నయీం ప్రధాన అనుచరుడైన శేషన్నను కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. శేషన్నను కూడా ఎన్ కౌంటర్ చేశారనే ప్రచారం జరిగింది. కాని పోలీసులు ఈ వార్తలను ఖండించారు. నయీం ఎన్ కౌంటర్ తర్వాత విచారణ చేపట్టిన సిట్.. రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా కేసులు నమోదు చేసింది. నయీం దగ్గర దొరికిన ఏకే–47తో పాటు అతడి డెన్ల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుంది.అయితే శేషన్న మాత్రం దొరకలేదు. నయీంకు సంబంధించిన డంప్ శేషన్న దగ్గర ఉందనే ప్రచారం సాగింది. మహబూబ్ నగర్ జిల్లా మన్ననూరు కేంద్రంగా కార్యకలాపాలు నడిపిన మాజీ మావోయిస్టు శేషన్న.. పటోళ్ల గోవవర్ధన్రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు.
గ్యాంగ్ స్టర్ నయీం తన నేర సామ్రాజ్యంలో పెద్ద వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నాడు. అందులో కీలకమైనది యాక్షన్ టీం. రహస్యంగా ఉంటూ నయీం ఆదేశాల మేరకు యాక్షన్ చేసేది. నయీం ఇచ్చిన టాస్క్ పూర్తి చేయడం.. మళ్లీ షెల్టర్ జోన్ కు వెళ్లేది. యాక్షన్ టీమ్ మర్డర్లు, కిడ్నాపులు చేస్తే.. పోలీసుల ముందు లొంగిపోయేందుకు మరో టీమ్ ఉండేది. దీంతో యాక్షన్ టీం వ్యవహారమంతా సీక్రెట్ గా జరిగేది. యాక్షన్ టీమ్ ను శేషన్న లీడ్ చేసేవారని టాక్ ఉంది. అందుకే నయిం యాక్షన్ టీమ్ పై పోలీసుల దగ్గర పెద్దగా కేసులు కూడా లేవని తెలుస్తోంది. ఎన్ కౌంటర్ తర్వాత నయీం డెన్లలోనూ దొరికిన భారీ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ విషయం నయీంతో పాటు శేషన్నకు మాత్రమే తెలిసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఆరున్నర ఏళ్ల తర్వాత శేషన్న పట్టుబడటంతో గ్యాంగ్ స్టర్ నయీంకు సంబంధించిన మరిన్ని సంచలనాలు విషయాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు.
Read Also: Italy New PM Meloni: ఇటలీ చరిత్రలోనే తొలిసారి.. దేశ ప్రధానిగా ఓ మహిళ..
Read Also: Whatsapp New Feature: వాట్సప్‌లో కొత్త ఫీచర్, ఒకేసారి 32 మందితో వీడియో కాల్ సౌకర్యం,
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి