Italy New PM Meloni: ఇటలీ ప్రధాని పదవిని తొలిసారి ఓ మహిళ నేత చేపట్టబోతున్నారు. ఆదివారం జరిగిన ఇటలీ పార్లమెంట్ ఎన్నికల్లో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి (Brothers of Italy party) చెందిన అతివా నేత జార్జియా మెలోని (Giorgia Meloni), మారియో డ్రాఘీపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మెలోని(45) 26.37శాతం ఓట్లు సాధించారు. ఆమె నేతృత్వంలోని కూటమి 43శాతానికి పైగా ఓట్లను సాధించింది.
ఇటలీలో రెండో ప్రపంచ యుద్ధం (world war 2) తర్వాత ఏర్పడిన పూర్తి అతివాద ప్రభుత్వం ఇదే కానుంది. ‘'గాడ్ ఫాదర్‌ల్యాండ్ ఆఫ్ ఫ్యామిలీ' అనే వివాదాస్పద నినాదంతో ప్రజలందరినీ ఆకర్షించారు మెలోని. ఈమె పార్టీ గత ఎన్నికల్లో కేవలం నాలుగు శాతం ఓట్లు మాత్రమే సాధించింది.
ఇటలీ ప్రధానిగా మెలోని బాధ్యతలు స్వీకరిస్తే ఆ దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఎల్‌జీబీటీ (LGBT) హక్కులకు వ్యతిరేకంగా ఆమె తన గళాన్ని విప్పారు. అంతేకాకుండా ఇటలీ నౌకాదళం లిబియా సముద్ర మార్గాన్ని మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెలోని గ్రాబ్టెల్లాలోని ఓ కార్మిక కుటుంబంలో జన్మించారు. ఆమె ఈ నెలాఖరులోగా ప్రధాని పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Russia School Shootings: రష్యా స్కూల్లో కాల్పులు.. 13 మంది మృతి, 20 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook