One Moto India Launch: ఇండియాలోని ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) అందుబాటులోకి తెచ్చేందుకు బ్రిటీష్ బ్రాండ్ వన్-మోటో (One Moto) ముందుకొచ్చింది. భారతదేశంలో తమ వన్-మోటోకు చెందిన తయారీ యూనిట్ ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు సదరు సంస్థ ఓ అహగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ శివారులో ఆ బ్రాండ్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో ఎలక్ట్రిక్ వెహికల్స్ లో విప్లవాన్ని సృష్టిస్తామని బలంగా నమ్ముతున్నట్లు వన్-మోటో సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ తయారీ యూనిట్ కోసం దాదాపు రూ.250 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు వన్-మోటో సంస్థ సీఈవో శుభంకర్ చౌదరి తెలిపారు.
ఏడాది లక్ష్యం..
వన్-మోటో తయారీ యూనిట్ తెలంగాణలో స్థాపించిన మొదటి ఏడాదిలో దాదాపుగా 40 వేల ఎలక్ట్రిక్ వెహికల్స్ ను తయారు చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆ సంస్థ సీఈవో వెల్లడించారు. తమ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి పరోక్షంగా 2 వేల మందికి పైగా ఉపాధి కల్పించినట్లు అవుతుందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ లో స్థాపించనున్న తయారీ కర్మాగారాన్ని దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ లో అదనపు సెమీ-రోబోటిక్స్ తో మేజర్ అటోమేషన్ ఇంటిగ్రేషన్ తో పాటు అత్యాధునిక ఉత్పత్తులను ఉత్పత్తి చేసేందుకు తయారీ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఇటీవలే గ్రేటర్ నోయిడా వేదికగా జరిగిన ఎక్స్ పో లో తమ కొత్త ఈ-స్కూటర్ ను ఎలక్టాను వన్-మోటో సంస్థ విడుదల చేసింది. గతేడాది నవంబరులో భారత మార్కెట్లోకి వచ్చిన ఈ బ్రాండ్.. ఇప్పటికే మూడు వేరియంట్స్ ను విపణిలో ప్రవేశపెట్టింది. బైకా, ఎలెక్టా, కమ్యూటా అనే ఈ-స్కూటర్ వేరియంట్స్ ను భారత మార్కెట్లో అందుబాటులో ఉంచింది వన్-మోటో.
తెలంగాణలోని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న ప్లాంట్ ద్వారా రెండు ఇండియన్ ఫ్లీట్ లలో పాటు అన్నీ వన్-మోటో ఫ్లీట్ లను ఉత్పత్తి చేయనున్నారు. వీటిని ఎల్లీసియం ఆటోమోటివ్స్ దేశంలోకి ప్రవేశపెట్టనున్నాయి.
Also Read: Todays Gold Rate: పెరిగిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి