క్యారీ బ్యాగ్ కొనుగోలు చేయమని ఒత్తిడి.. పిజ్జా కంపెనీకి రూ.11 వేలు జరిమానా

Hyderabad Consumer Forum: హైదరాబాద్ లోని ఓ పిజ్జా అవుట్ లెట్ కు వినియోగదారుల ఫోరమ్ రూ.11 వేల జరిమానా విధించింది. తమ బ్రాండ్ లోగో ఉన్న క్యారీ బ్యాగ్ ను ఓ కస్టమర్ తప్పక కొనాలని ఒత్తిడి చేసినందుకే ఈ జరిమానా విధించినట్లు ఫోరమ్ స్పష్టం చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 01:23 PM IST
క్యారీ బ్యాగ్ కొనుగోలు చేయమని ఒత్తిడి.. పిజ్జా కంపెనీకి రూ.11 వేలు జరిమానా

Hyderabad Consumer Forum: తమ కంపెనీ క్యారీ బ్యాగ్ కచ్చితంగా కొనాలని ఒత్తిడి చేసిన హైదరాబాద్ లోని ఓ పిజ్జా అవుట్ లెట్ కు వినియోగదారుల ఫోరమ్ రూ. 11 వేల జరిమానాను విధించింది. పిజ్జాను కొనేవారు తప్పనిసరిగా తమ బ్రాండ్ ప్రింట్ చేసిన ఉన్న రూ.7.62ల విలువైన క్యారీ బ్యాగ్ ను కొనుగోలు చేయమని కస్టమర్ ను ఒత్తిడి చేయడమే అందుకు కారణమని తెలిపింది.

ఏం జరిగిందంటే?

మురళీశర్మ అనే విద్యార్థి.. 2019 సెప్టెంబరు 16న హైదరాబాద్ లోని శివమ్ రోడ్డులోని ఓ పిజ్జా అవుట్ లెట్ కు వెళ్లాడు. రూ.983.5 విలువ కలిగిన పిజ్జాలను కొనుగొలు చేసిన తర్వాత తమ క్యారీ బ్యాగ్ కొనుగోలు చేసినందుకు రూ.7.62 చెల్లించినట్లు చెప్పాడు. అయితే క్యారీ బ్యాగ్ పై ఆ అవుట్ లెట్ లోగా ఉండడం వల్ల కస్టమర్ దాన్ని తిరస్కరించి.. లోగో లేని క్యారీ బ్యాగ్ ఇవ్వాలని నిర్వాహకులను అడిగినా మరోక దాన్ని ఇవ్వలేదని తెలిపాడు. దీంతో తప్పక వారి బ్రాండ్ లోగో ఉన్న క్యారీ బ్యాగ్ తీసుకెళ్లినట్లు పేర్కొన్నాడు.

అయితే సదరు పిజ్జా అవుట్ లెట్ చేసిన పని వల్ల తాను వేధింపులుగా భావించినట్లు వినియోగదారుల ఫోరమ్ కు కంప్లైంయింట్ ఇచ్చాడు. అలా ఆ పిజ్జా బ్రాండ్ లోగా క్యారీ బ్యాగ్ తో వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు.. ఆ బ్రాండ్ ప్రచారం చేయడం సహా తాను మానసిక వేదనకు గురైనట్లు చెప్పాడు. దీంతో తనను ఓ అడ్వర్టైజ్ మెంట్ ఏజెంట్ గా చుట్టుపక్కల వాళ్లు భావించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదంతా ఆ బ్రాండ్ లోగో ఉన్న క్యారీ బ్యాగ్ వల్లే జరిగిందని చెప్పాడు.

దీనిపై విచారణ జరిపిన వినియోగదారుల సేవాకేంద్రం.. బ్రాండ్ లోగో ఉన్న క్యారీ బ్యాగ్ ను కస్టమర్ కొనుగోలు చేయడాన్ని ఖండించింది. అయితే క్యారీ బ్యాగ్ కొనాలా? లేదా? అనేది పూర్తిగా వినియోగాదారుడి ఇష్టమని సదరు పిజ్జా అవుట్ లెట్.. వినియోగదారుల ఫోరమ్ కు విన్నవించుకుంది. తమ బ్రాండ్ ఉన్న క్యారీ బ్యాగ్ ను కొనుగోలు చేయమని తాము బలవంతం చేయలేదని కంపెనీ స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన ఫోరమ్.. ‘కంపెనీ లోగో’ ఉన్న బ్యాగ్ కోసం వినియోగదారుల నుంచి డబ్బు వసూలు చేయడాన్ని తప్పబట్టింది. అలా చేస్తే వినియోగదారులను అడ్వర్టైజింగ్ ఏజెంట్ గా ఉపయోగించుకున్నట్లే అని తేల్చి చెప్పింది. దీంతో బాధిత కస్టమర్ కు రూ.11 వేల నష్ట పరిహారాన్ని అందజేయాలని ఆ పిజ్జా అవుట్ లెట్ ను ఫోరమ్ అదేశించింది. 

Also Read: కాల్వలోకి దూకి విద్యార్థి ఆత్మహత్య..ఎంటెక్​లో సీటు రాకపోవడమే కారణం...

Also Read: చిరంజీవి రాజకీయాల గురించి వెంకయ్య నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News