Telangana: రైళ్లు నడిచుంటే ..పెను ప్రమాదమే జరిగుండేదా

తెలంగాణలోని ఫలక్ నుమా రైల్వే ట్రాక్ వద్ద పెను ప్రమాదం తప్పింది. కరోనా మహమ్మారి కారణంగా పాసెంజర్ రైళ్లు నడవకపోవడంతో భారీ ప్రమాదం జరగకుండా ఆగింది.

Last Updated : Aug 19, 2020, 05:52 PM IST
Telangana: రైళ్లు నడిచుంటే ..పెను ప్రమాదమే జరిగుండేదా

తెలంగాణలోని ఫలక్ నుమా రైల్వే ట్రాక్ వద్ద పెను ప్రమాదం తప్పింది. కరోనా మహమ్మారి కారణంగా పాసెంజర్ రైళ్లు నడవకపోవడంతో భారీ ప్రమాదం జరగకుండా ఆగింది. ఫలక్ నుమా వద్ద రైల్వే ట్రాక్ కింద భూమి కుంగిపోయి...ఏకంగా 8 మీటర్ల మేర గొయ్యి ఏర్పడింది. గస్తీ నిర్వహిస్తున్న రైల్వే హోంగార్డు కంటబడటంతో అప్రమత్తమై...అధికార్లకు సమాచారం అందించాడు. అదే ట్రాక్ పై వస్తున్న గూడ్స్ రైలును సమీపంలోని స్టేషన్ లో నిలిపివేశారు. 

Hole under the track

పాసెంజర్ రైళ్లు నడవకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్టయింది. ఒకవేళ పాసెంజర్ రైళ్లు నడుస్తుంటే..ఈ ట్రాక్ ఎప్పుడూ బిజీగానే ఉండేది. భారీ ప్రమాదమే తలెత్తి ఉండేదంటున్నారు రైల్వే అధికార్లు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేల కుంగిపోయుండవచ్చని తెలుస్తోంది. Also read: Telangana: మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా

Hole under the track

Trending News