Janwada rave party: కేటీఆర్ నోరువిప్పాలి.. జన్వాడ రేవ్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్..

Cyberabad sot busted rave party in janwada: జన్వాడలో రేవ్ పార్టీ కలకలం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత బంధువుల ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి రేవ్ పార్టీ జరిగినట్లు తెలుస్తొంది.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 27, 2024, 01:05 PM IST
  • తెలంగాణలో మళ్లీ రేవ్ పార్టీ కలకలం..
  • కీలక వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్..
Janwada rave party: కేటీఆర్ నోరువిప్పాలి.. జన్వాడ రేవ్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్..

Bandi Sanjay hot comments on janwada rave party: తెలంగాణలో మరోసారి రేవ్ పార్టీ ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ పై ఉక్కుపాతం మోపుతున్నారు. ఎక్కడ కూడా డ్రగ్స్ వినియోగం కానీ సరఫరా కానీ ఉండకుండా చూడాలని అధికారులకు సీరియస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి రేవ్ పార్టీ జరిగినట్లు తెలుస్తొంది.

బీఆర్ఎస్ కీలకనేతకు చెందిన దగ్గరి బంధువైన రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. మొదటగా.. జన్వాడలోని సమీపంలోని ప్రజలు ఫామ్ హౌస్ లో ఏదో డీజేలు, మందు పార్టీలు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది.

దీంతో ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగి ఫామ్ హౌస్ పై దాడి చేశారు. అక్కడ రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచన వేసినట్లు తెలుస్తొంది. భారీ ఎత్తున విదేశీ లిక్కర్ తో పాటు, అమ్మాయిలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  అంతే కాకుండా.. ఆ  పార్టీలో 40  మందికిపైగా రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తొంది.

ఇదిలా ఉండగా.. ఎస్ ఓటీ పోలీసులు 24 మందికి టెస్ట్ లు చేయడగా.. విజయ్ మజ్దూరీ అనే బిజినెస్ మెన్ తో పాటు మరో ఇద్దరికి కూడా పాజిటివ్ గా వచ్చినట్లు తెలుస్తొంది. దీంతో వీళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ రేవ్ పార్టీలో రాజ్ పాకాలా తాను బీఆర్ఎస్ నేతల బంధువని చెప్పి పోలీసులు మీదే ఎదురు తిరిగినట్లు తెలుస్తొంది.

ప్రస్తుతం జన్వాడ ఫామ్ హౌస్ కు పోలీసులు భారీ ఎత్తున చేరుకుంటున్నట్లు తెలుస్తొంది.  పోలీసులు ప్రస్తుతానికి రేవ్ పార్టీలో దొరికిన వారిపై..  NDPS యాక్ట్‌, సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

Read more: CM Revanth Reddy: తెలంగాణ కేబినెట్ భేటీ.. దీపావళికి ముందు రేవంత్ సంచలన నిర్ణయాలు..?

ఇదిలా ఉండగా.. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్వాడ్ రేవ్ పార్టీపై ఫైర్ అయ్యారు. కేటీఆర్ దీనిపైన ఏమంటారని నిలదీశారు. అంతే కాకుండా రేవంత్ సర్కారు దీని వెనుకాల ఎంతటి వారున్న.. అందరిని బైటకు తీసుకొని రావాలని కూడా డిమాండ్ చేశారు. అదే విధంగా ఆధారాలు ధ్వంసం కాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకొవాలని కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు.

కాంగ్రెస్ కు నిజమైన చిత్తశుద్దితో దీనిపై విచారణ చేయాలని కూడా బండి సంజయ్ డిమాండ్ చేశారు. 20 మంది వరకు మగవాళ్లు, 14 మంది వరకు అమ్మాయిలు కూాడ ఉన్నట్లు తెలుస్తొంది. విదేశీ మద్యంపై కూడా విచారణ చేపట్టాలని బండి సంజయ్ రేవంత్ సర్కారును కోరినట్లు తెలుస్తొంది.  ఈ రేవ్ పార్టీ ఘటన మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News