AP Govt: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..జగనన్న విదేశీ విద్యా దీవెన మార్గదర్శకాలు ఇవే..!

AP Govt: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం మరో వరం ప్రకటించింది. విదేశీ విద్య కోసం సీఎం వైఎస్ జగన్ భారీ పథకాన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Written by - Alla Swamy | Last Updated : Jul 11, 2022, 06:26 PM IST
  • ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్
  • విదేశీ విద్య కోసం భారీ పథకం
  • అధికారిక ఉత్తర్వులు జారీ
AP Govt: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..జగనన్న విదేశీ విద్యా దీవెన మార్గదర్శకాలు ఇవే..!

AP Govt: జగనన్న విదేశీ విద్యా దీవెనపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి వివక్షకు తావులేకుండా ప్రతిభకే పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలను జారీ చేశారు. ఆర్థికంగా వెనుకబడ్డ అగ్ర కులాల వారికి ఈపథకం వర్తించనుంది. క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును ప్రభుత్వం స్వయంగా భరించనుంది. మొదటి వంద ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్సిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ దక్కనుంది. 

వందకుపైబడి 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న వర్సిటీల్లో సీటు సాధిస్తే రూ.50 లక్షల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్ జమ కానుంది. ల్యాండింగ్ పర్మిట్, ఐ-94 ఇమ్మిగ్రేషన్ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లించనున్నారు. ఫస్ట్ సెమిస్టర్, టర్మ్ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెండో సెమిస్టర్ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లించనున్నారు. 

నాలుగో సెమిస్టర్, ఫైనల్ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లిస్తారు. పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ విద్యార్థులకు ఏడాది వారిగా లేదా సెమిస్టర్ వారిగా కోర్సు పూర్తయ్యేంత వరకు ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లింపు జరుగుతుంది. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఈపథకం వర్తించనుంది. టాప్ 200 యూనివర్సిటీల్లో ఎన్ని సీట్లు సాధిస్తే వారందరికీ సంతృప్తికర స్థాయిలో జగనన్న విదేశీ దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ దక్కనుంది. 

35 ఏళ్ల లోపు ఉన్న వారందరూ జగనన్న విదేశీ విద్యా దీవెన అర్హులుగా గుర్తించనున్నారు. ఏపీలో స్థానికుడై ఉండాలి..కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈపథకం వర్తించనుంది. ప్రతి ఏటా సెప్టెంబర్, డిసెంబర్, జనవరి, మే మధ్య అర్హుల గుర్తింపు కోసం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీచే అర్హుల ఎంపిక జరుగుతుంది. 

Also read:PM Modi: ఢిల్లీలో కీలక ఘట్టం.. కొత్త పార్లమెంట్‌లో జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ..!

Also read:CM Jagan Review: నాణ్యత విషయంలో రాజీ పడం.. ఇళ్ల నిర్మాణాలపై సీఎం జగన్ సమీక్ష..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News