Revanth Reddy: ZPTC స్వతంత్ర అభ్యర్థి నుంచి సీఎం అభ్యర్థి వరకు..రేవంత్‌ రెడ్డి సక్సెస్‌ స్టోరి!

Revanth Reddy Biography: ఇప్పుడు ఏ సోషల్‌ మీడియాలో చూసిన రేవంత్‌ రెడ్డి పేరు మారుమోగిపోతోంది. ZPTC స్వతంత్ర అభ్యర్థిగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం..ఇప్పుడు సీఎం రేసులో నిలిచేలా చేసింది. అంతేకాకుండా రాజకీయ జీవితంలో ఎంతో కష్టపడ్డారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2023, 03:51 PM IST
Revanth Reddy: ZPTC స్వతంత్ర అభ్యర్థి నుంచి సీఎం అభ్యర్థి వరకు..రేవంత్‌ రెడ్డి సక్సెస్‌ స్టోరి!

Revanth Reddy Biography: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుముల రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) పేరు మారుమోగిపోతోంది. మంచి RSS అనుబంధంతో..మొదలుకొని జిల్లాపరిషత్‌ ఎన్నికవ్వడం..తెలంగాణాలో మొదటిసారిగా కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడం వరకు జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఆరోపణలు ఎదురైనా..ఏ మాత్రం తగ్గకుండా వాటన్నింటిని తనదైన శైలిలో ఎదుర్కొంటూ దూసుకెళ్లారు. అంతేకాకుండా తెలంగాణలో జనాకర్షన నేతగా ఎదగడం ఎంతో విశేషం. ఎట్టకేలకు అందురూ అనుకుంటున్నట్లే కాంగ్రెస్‌ పార్టీకి అధికారం లభించింది. ఇక రేవంత్‌ రెడ్డి జీవితాన్ని మొత్తం పరిశీలిస్తే..

మొదట జడ్పీటీసీగా ప్రారంభం:
రేవంత్‌రెడ్డి అనుముల న‌ర్సింహరెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు మహబూబ్‌నగర్‌లోని కొండారెడ్డిపల్లిలో 1969లో జన్మించారు. రేవంత్‌రెడ్డి AV కళాశాలలోని బీఏను పూర్తి చేశారు. ఆయన యూత్‌గా ఉన్నప్పడే ఏబీవీపీలో చురుగ్గా ఉండేవారు. మిడ్జిల్‌ మండలంలోని 2006లో ZPTC స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి..2007లో మహబూబ్‌నగర్‌లో MLCగా స్వతంత్ర అభ్యర్థిగా నిలిచారు. ఆ తర్వాత టీడీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా మంచి గుర్తింపు రావడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

చికటి రోజులు:
రేవంత్‌ రెడ్డిపై 2015 సంవత్సరంలో ‘ఓటుకు నోటు కేసు’లో సంచనల ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత రేవంత్‌ అరెస్టై, బెయిల్ మీద బయటికి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే..చివరికి 2017 సంవత్సరంలో అక్టోబర్‌లో కాంగ్రెస్‌లో జాయిన్‌ అయ్యారు. అప్పటి నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ వచ్చారు. అతి కొద్ది రోజుల్లోనే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నియమితులయ్యారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో జీవం పోసుకుంది. 2018 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా..మల్కాజిగిరి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున MPగా గెలిచారు. అప్పటి నుంచి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ వస్తున్నారు. 

కొత్త హంగుల్లో ప్రచారం:
రేంవత్‌ రెడ్డి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఎండగడుతున్న పనితీరును గుర్తించి కాంగ్రెస్‌ పెద్దలు 2021 జూన్‌లో టీపీసీసీ అధ్యక్షుడిగా నిమించింది. ఇదే ఆయన రాజకీయ జీవితాన్ని మొత్తం మార్చేసింది. అంతేకాకుండా కాగ్రెంస్‌ పార్టీకి కొత్త హైపును తీసుకువచ్చారు. అయితే రేంవత్‌ రెడ్డి పార్టీకి చేస్తున్న సేవలను కొందరు సొంత పార్టీ నేతలే తప్పబట్టి విమర్శించారు. ఈ సమయంలో ఏ మాత్రం వెనకాడకుండా తనదైన శైలిలో పార్టీని ముందుకు నడిపించారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా  కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీకి దిగారు. అటు కొడంగల్‌లో కూడా పోటీ చేసి మంచి మోజారీటితో గెలుపొంది..సీఎం రేసులో నిలిచారు. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News