కారులో తరలిస్తుండగా పట్టుబడిన రూ. 8 కోట్లు, బీజేపి నేతపై అనుమానాలు

కారులో తరలిస్తుండగా పట్టుబడిన రూ. 8 కోట్లు

Last Updated : Apr 8, 2019, 11:45 PM IST
కారులో తరలిస్తుండగా పట్టుబడిన రూ. 8 కోట్లు, బీజేపి నేతపై అనుమానాలు

హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో భాగంగా హైదరాబాద్ నారాయణగూడ చౌరస్తాలో వాహనాల తనిఖీ నిర్వహిస్తోన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అటుగా వచ్చిన ఓ కారును ఆపి తనిఖీ చేయగా అందులో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. కారులో తరలిస్తోన్న నగదు మొత్తాన్ని 8 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా గుర్తించారు. పట్టుబడిన నగదును ఇండియన్ బ్యాంకు నుంచి బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేరిట డ్రా చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్టు తెలుస్తోంది. దీంతో ఎన్నికల నేపథ్యంలో ఏ అవసరం కోసం ఆయన ఇంత భారీ మొత్తంలో నగదు డ్రా చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  

ఈ ఘటనలో ప్రదీప్ రెడ్డి, శంకర్, సుకుమార్ రెడ్డి, నందిరాజు గోపి, చలపతి రాజు, ఇందుశేఖర్, బ్రహ్మం అనే ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని మరింత లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి వుంది.

Trending News