SCCL Apprenticeship: సింగరేణిలో 1300 అప్రెంటిస్‌షిప్ పోస్టులకు నోటిఫికేషన్...

SCCL Notification 2022: సింగరేణి సంస్థ 1300 అప్రెంటిస్‌షిప్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 26, 2022, 03:45 PM IST
  • సింగరేణి నుంచి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్
  • 1300 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న సింగరేణి
  • ఐటీఐ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
SCCL Apprenticeship: సింగరేణిలో 1300 అప్రెంటిస్‌షిప్ పోస్టులకు నోటిఫికేషన్...

SCCL Notification 2022: ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో 1300 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఐటీఐ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం అభ్యర్థులు మొదట NAPS (National Apprenticeship Promotion Scheme) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆపై సింగరేణి అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య తేదీలు :

దరఖాస్తుల స్వీకరణ : జూలై 25, 2022
దరఖాస్తులకు చివరి గడువు : ఆగస్టు 8, 2022

వయోపరిమితి : జనరల్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు.

ఆ 4 జిల్లాల వారికి 95 శాతం రిజర్వేషన్ :

కోల్‌బెల్ట్ పరిధిలోకి వచ్చే ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్‌లో 95 శాతం రిజర్వేషన్ ఉంటుంది. నాన్ లోకల్ వారికి 5 శాతం ఉంటుంది. లోకల్ అభ్యర్థుల్లో సింగరేణి కుటుంబాలకు చెందినవారికి, డిపెండెంట్ జాబ్స్‌కి అర్హులైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

దరఖాస్తు విధానం :

అభ్యర్థులు సింగరేణి అధికారిక వెబ్‌సైట్ scclmines.com ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కాపీలను అభ్యర్థులు తమ పరిధిలోని ఎంవీటీసీ కేంద్రంలో సమర్పించాలి. బెల్లంపల్లి, మందమర్రి, రామగుండం,శ్రీరాంపూర్, కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి,ఇల్లందు పట్టణాల్లో ఎంవీటీసీ కేంద్రాలు ఉన్నాయి. మరిన్ని వివరాలకు ఎస్‌సీసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేేయండి.

Also Read: AP EAMCET Results 2022: ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..

Also Read: Employees Salarys: ఈ నెల నుంచే పెంచిన జీతాలు.. ఉద్యోగులకు సర్కార్ వరం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News