తెలంగాణలో 6కి చేరిన కరోనా మరణాలు

కొవిడ్19తో తెలంగాణలో మృతి చెందిన వారి సంఖ్య 6కి చేరుకుంది. మార్చ్ 13-15 మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి సోకింది.

Last Updated : Mar 31, 2020, 08:37 AM IST
తెలంగాణలో 6కి చేరిన కరోనా మరణాలు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనాతో మరో నలుగు మృతి చెందగా, దీంతో కొవిడ్19తో తెలంగాణలో మృతి చెందిన వ్యక్తుల సంఖ్య 6కి చేరుకుంది. మార్చి 13-15 మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి సోకింది. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, అపోలో ఆసుపత్రి, గ్లోబల్ ఆసుపత్రి, నిజామాబాద్, గద్వాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.

అంతేకాకుండా వీరి ద్వారా కరోనా సోకే అవకాశం ఉందని అనుమానిస్తున్న వారందరిని ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయని, ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు తమంతట తాముగా వచ్చి ఆసుపత్రుల్లో చేరాలని ప్రభుత్వ వర్గాలు సూచించాయి. లేనిపక్షంలో కరోనా వైరస్ సోకి వారు కూడా చనిపోయే అవకాశం ఉందని, వారి కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 

Read also : అసలు నిజం దాచిన కంపెనీ.. 17 మందికి కరోనా.. సంస్థపై కేసు నమోదు
మరోవైపు 13 మంది కరోనా బాధితులు కోలుకుని నెగెటివ్ అని తేలగా సోమవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని, కొత్తగా మరో ఆరు కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ రాత్రి 8 గంటలకు విడుదల చేసిన బులిటెన్‌లో తెలిపింది. ఈ రోజు నమోదైన కేసుల్లో కరీంనగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, వారి కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి పాజిటివ్ ఉండగా, అతని నుంచి వారికి సోకిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 77 కేసులు నమోదు కాగా, ఆరు మరణాలు సంభవించాయని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బుల్లితెర భామ టాప్ Bikini Photos    

Read Also: విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసెస్.. రేషన్ డీలర్లకు సీఎం వార్నింగ్!

Trending News