MLA Rajaiah Vs MLC Kadiyam Srihari: ఆసక్తిరేపుతున్న ఎమ్మెల్యే రాజయ్య వైఖరి.. కడియంకు కష్టాలు తప్పవా ?

MLA Rajaiah Vs MLC Kadiyam Srihari in Station Ghanpur: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో బిఆర్ఎస్ రాజకీయాలు శరవేగంగా మారాయి. ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి మార్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టిక్కెట్ కాదని... ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్టేషన్ ఘన్పూర్‌లో రాజకీయ సమీకరణాలు మారాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 27, 2023, 08:10 AM IST
MLA Rajaiah Vs MLC Kadiyam Srihari: ఆసక్తిరేపుతున్న ఎమ్మెల్యే రాజయ్య వైఖరి.. కడియంకు కష్టాలు తప్పవా ?

MLA Rajaiah Vs MLC Kadiyam Srihari in Station Ghanpur: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో బిఆర్ఎస్ రాజకీయాలు శరవేగంగా మారాయి. ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి మార్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టిక్కెట్ కాదని... ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్టేషన్ ఘన్పూర్‌లో రాజకీయ సమీకరణాలు మారాయి. బిఆర్ఎస్ నుంచి టిక్కెట్ లభించకపోవడంతో రాజయ్య అనుచరులు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని ఒక్క ఛాన్స్ ఇవ్వండని వేడుకుంటున్నారు. రాజయ్య శత్రు శని దోష నివారణకై ఐదోసారి ఎమ్మెల్యే అవ్వాలని రాజ్యశ్యామల యాగం చేశారు. ఎమ్మెల్యే యాగం, పూజల ఫలితం లభించలేదు.

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వైఖరి వివాదాస్పదంగా మారుతుండడంతో పార్టీ గెలుపు కోసం సిట్టింగ్ ను కాదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని అభ్యర్థిగా ప్రకటించారు. ఎమ్మెల్యే రాజయ్య తనని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని జానకిపురం సర్పంచ్ నవ్య అనేక ఆరోపణలు, విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దళిత బంధు పథకంలో రాజయ్య డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిని బీఆర్ఎస్ అధిష్టానం పరిగణలోకి తీసుకొని ఈసారి స్టేషన్గన్పూర్ లో అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరి కూడా ఈసారి ఎలాగైనా తనకు టికెట్ కేటాయించాలని అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు బీఆర్ఎస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజయ్యకు టికెట్ రాకపోవడంతో అనుచర వర్గం ఆవేదనతో ఆందోళన చెందుతోంది. కడియం వద్దు.. రాజయ్య ముద్దు అంటూ ప్లీజ్ ఒక్క అవకాశం రాజయ్యకు ఇవ్వండని విజ్ఞప్తి చేస్తూ రాజయ్య అనుచరులు రోడ్డెక్కుతున్నారు.

చివరి ప్రయత్నంగా గుళ్ళు గోపురాలు తిరుగుతూ శత్రుదోష నివారణకై పూజలు చేశారు ఎమ్మెల్యే రాజయ్య. మూడోసారి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించాలని, తాను ఐదోసారి ఎమ్మెల్యే కావాలని రాజ్యశ్యామల యాగం చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అనేక రకాలుగా శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో శత్రుదోషాలు నశించి, విజయానికి మార్గం సుగమం కావాలని యాగం చేసినట్లు రాజయ్య చెప్పారు.. కానీ ఎమ్మెల్యే రాజయ్య అనుకున్నదొక్కటి... అయిందొకటి.

బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం టికెట్లు ప్రకటించిన మరుసటి రోజు ఎమ్మెల్యే రాజయ్య స్టేషన్ ఘన్పూర్ వచ్చారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు రాజయ్య కలిసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు. వారందరిని చూసి ఎమ్మెల్యే రాజయ్య బోరున విలపించారు.  రాజయ్య నియోజకవర్గం వస్తున్నాడని తెలిసి ఆయన అనుచరులు, వర్గీయులు భారీగా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. టికెట్ లభించకపోవడంతో ఆవేదనతో ఉన్న రాజయ్యను చూసి కార్యకర్తలు కూడా కంటతడి పెట్టుకున్నారు. దీంతో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. సీఎం కేసిఆర్ ఆశీస్సులు ఉన్నాయి. అందరూ సమన్వయం పాటించండని కార్యకర్తలకు చెప్పారు. పసిపిల్లల డాక్టర్ అయిన తాను అంబేడ్కర్ బిక్ష వల్ల ఎమ్మెల్యే అయ్యాను. దయచేసి ఎవరినీ బాధ పెట్టొద్దన్నారు. అనంతరం స్టేషన్ ఘనపూర్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ర్యాలీగా వెళ్లి... అక్కడ వర్షంలోనే మౌన దీక్ష చేశారు. అంబేద్కర్ విగ్రహం ముందు పడుకొని కన్నీటి పర్యంతమయ్యారు.

ఎమ్మెల్యే రాజయ్య బోరున విలపించడంతో.. అలాగే కార్యకర్తలు కూడా ఈసారి ఎలాగైనా బరిలో ఉండాలని చెప్తుండటంతో రాజయ్యను బుజ్జగించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చేపట్టింది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హనుమకొండలోని ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి వచ్చి కలిసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే రాజయ్య అందుబాటులో లేకపోవడంతో కాసేపు అక్కడే కూర్చుని ఆయన అనుచరులతో సమావేశమై వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే రాజయ్యకు బీఆర్ఎస్ అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుంది, రెండు మూడు రోజుల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తామని పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. రాజయ్య, కడియం శ్రీహరి, తాను కలిసి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంపై గులాబీ జెండాను ఎగురవేస్తామన్నారు. కడియం శ్రీహరి ర్యాలీలో పాల్గొనేందుకు రావాలంటూ ఎమ్మెల్యే రాజయ్యను ఫోన్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరినట్లు సమాచారం. ప్రస్తుతం తాను వేరే పనిలో ఉన్నానంటు రేపు మిమ్మల్ని కలుస్తా అంటూ సున్నితంగా పల్లాను కలవకుండా ఎమ్మెల్యే రాజయ్య తప్పించుకున్నారని జిల్లాలో చర్చ నడుస్తోంది.

మరోవైపు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ప్రకటించిన తరువాత తొలిసారిగా ఈరోజు కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ కు వచ్చారు. దీంతో కడియం కు ఘనంగా స్వాగతం పలికారు. నెలుట్ల క్రాస్ నుండి స్టేషన్ ఘన్పూర్ వరకు భారీ ర్యాలీ తీశారు. అనంతరం స్టేషన్గన్పూర్ లోని శివాజీ విగ్రహం దగ్గర పబ్లిక్ మీటింగ్ లో కడియం శ్రీహరి పాల్గొన్నారు. కడియంతో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

స్టేషన్ ఘనపూర్ లో కడియం శ్రీహరి ఎంట్రీతో ఆయన అనుచరులు జోష్ లో ఉన్నారు. రాజయ్య అనుచరులు, అభిమానులు ఆవేదనతో కన్నీటి పర్యంతమవుతున్నారు. దీంతో స్టేషన్ ఘన్పూర్ లో ఉద్విగ్నభరిత వాతావరణం కనిపిస్తోంది. రాజయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తి ఉన్నారు. తాను ప్రజాక్షేత్రం లొనే ఉంటానని స్పష్టం చేశారు. భూమి కొని మొట్లు కొట్టి, ముళ్ళు ఏరి, కాలబెట్టి దుక్కిదున్ని నీళ్లు పోసి నారుపోసి కలుపు తీసి వరి కోసి కుప్పకొట్టి రాశి పెట్టినంక ఎవరో వచ్చి కూర్చుంటామంటే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజయ్య మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతోంది.

ఇది కూడా చదవండి : Kamareddy MLA Election: కామారెడ్డిలో కేసిఆర్‌ ఇక గెలిచినట్టేనా ?

బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ పొందిన కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ లో స్పీడ్ పెంచారు. ఎమ్మెల్యే రాజయ్య పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి ? రాజయ్య ధైర్యం చేసి ఇతర పార్టీ నుండి పోటీచేస్తారా ? లేదా కెసిఆర్ మాటకు రాజయ్య కట్టుబడి ఉంటారా అని జిల్లాలో సర్వత్ర చర్చ జరుగుతోంది. మొత్తానికి రాజయ్య వర్గం ఆయనకు టికెట్ ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉండటంతో ఈసారి కడియం శ్రీహరికి టికెట్ వచ్చినా.. గెలుపు కోసం నానా కష్టాలు పడక తప్పేలా లేవనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే రాజయ్య రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే మరి.

ఇది కూడా చదవండి : SC, ST Decleration: చేవెళ్ల ప్రజాగర్జన సభలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News