Telangna Guarantee Schemes: తెలంగాణ ఐదు గ్యారంటీ పధకాలు కావాలంటే ఏం చేయాలి, ఎవరు అర్హులు, దరఖాస్తు ఎలా నింపాలి

Telangna Guarantee Schemes: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పధకాలకు ఎలా అప్లై చేయాలనే విషయంపై స్పష్టత వచ్చేసింది. ప్రభుత్వం వినూత్నంగా అన్ని పథకాలకు కలిపి ఒకే దరఖాస్తు సిద్ధం చేసింది. ఈ దరఖాస్తు ఎలా నింపాలి, ఏయే డాక్యుమెంట్లు అవసరమనే వివరాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 28, 2023, 08:07 AM IST
Telangna Guarantee Schemes: తెలంగాణ ఐదు గ్యారంటీ పధకాలు కావాలంటే ఏం చేయాలి, ఎవరు అర్హులు, దరఖాస్తు ఎలా నింపాలి

Telangna Guarantee Schemes: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదు పథకాల అప్లికేషన్ ఫామ్ విడుదల చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ పధకాల్లో ఐదు పధకాలకు ఈ ఒక్క అప్లికేషన్ నింపి ఇస్తే సరిపోతుంది. ఈ అప్లికేషన్లు ఎక్కడ లభిస్తాయి, ఎలా నింపాలి, ఏయే డాక్యుమెంట్లు అవసరం అనే సందేహాలకు సమాధానం మీ కోసం..

తెలంగాణ ప్రభుత్వం ఐదు పధకాల దరఖాస్తుల స్వీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభించనుంది. తెలంగాణ ప్రజా పాలన దరఖాస్తు పేరుతో ఐదు గ్యారంటీ పధకాలకు ఒకటే అప్లికేషన్ ఇది. ఇందులో మహాలక్ష్మి పధకం కింద ప్రతి నెలా మహిళలకు అందించే 2500 రూపాయల ఆర్ధిక సహాయం, 500 రూపాయలకు గ్యాస్ సిలెండర్ ఉంటాయి. రైతులకు ఏడాదికి ఎకరానికి ఇచ్చే 15000 రూపాయల ఫదకం రైతు భరోసా ఉంటుంది. మూడవది ఇందిరమ్మ ఇండ్లు పధకం ఉంటుంది. నాలుగవది ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చే గృహ జ్యోతి పధకం, చేయూత పెన్షన్ పధకాలుంటాయి.

అప్లికేషన్ ఎలా నింపాలి

మహాలక్ష్మి పధకం కింద నెలకు 2500 రూపాయల ఆర్ధిక సహాయం కావాలంటే అక్కడున్న బాక్స్‌లో టిక్ చేయాలి. అదే విధంగా 500 రూపాయల గ్యాస్ సిలెండర్ పొందాలంటే అక్కడుండే బాక్స్ టిక్ పెట్టాలి. దాంతో పాటు గ్యాస్ కనెక్షన్ నెంబర్, సరఫరా చేసే కంపెనీ, ఏడాదికి ఖర్చయ్యే సిలెండర్ల సంఖ్య నమోదు చేయాలి. 

ఇక రైతు భరోసాలో రెండు బాక్సులుంటాయి. రైతు, కౌలు రైతుల్లో దేనికి చెందుతారా అది టిక్ పెట్టాలి. పట్టాదారు పాసు పుస్తకం నంబర్లు, సాగు చేసే భూమి సర్వే నెంబర్, విస్తీర్ణం వివరాలు నింపాలి. వ్యవసాయ కూలీ అయితే అక్కడ టిక్ చేసి ఉపాధి హామీ కార్డు నెంబర్ వివరాలు రాయాలి. 

ఇక ఇందిరమ్మ ఇండ్లు పధకంలో ఇంటి నిర్మాణం కోసం బాక్స్‌లో టిక్ పెట్టాలి. రెండవ బాక్సు అమరవీరులు, ఉద్యమకారులకు సంబంధించింది. అందులో సంబంధిత వివరాలు నమోదు చేయాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉంటే అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నెంబర్ ఇతర వివరాలు ప్రస్తావించాలి. 

నాలుగవ పధకం గృహ జ్యోతిలో నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం సంబంధిత బాక్సులో టిక్ పెట్టి గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య రాయాలి. ఇక ఐదవ పధకం చేయూతలో నెలకు 4000, దివ్యాంగులకు నెలకు 6000 పింఛన్ కోసం సంబంధిత వివరాలు నమోదు చేయాలి. ఇప్పటికే పెన్షన్ పొందుతున్నవారు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. 

ఈ పధకాల కోసం ఆధార్ కార్డు జిరాక్స్, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ జత చేయాల్సి ఉంటుంది. అన్ని సమర్పించిన తరువాత ఇచ్చిన వివరాలు వాస్తవమని సదరు లబ్దిదారుడు ధృవీకరణగా సంతకం లేదా వేలి ముద్ర వేయాలి. చివరిగా అదే దరఖాస్తులో ఉండే రశీదు నింపి ప్రభుత్వం ముద్రతో దరఖాస్తు దారునికి ఇస్తారు. ఈ అప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమం ఇవాళ అంటే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకూ కొనసాగుతుంది. గ్రామ సభలు, పట్టణాలు, మున్సిపల్ వార్డుల్లో జరుగుతుంది. 

Also read: Bus Fired: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం, బస్సులో మంటలు, 12 మంది సజీవ దహనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News