Telangana Assembly Elections: వాళ్లకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం.. అసెంబ్లీ ఎన్నికల్లో అమలు

Vote From Home In Assembly Elections: తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎవరు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనే వివరాలతో ఆయా రాష్ట్రాలకు సమాచారాన్ని పంపించింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 21, 2023, 07:04 AM IST
Telangana Assembly Elections: వాళ్లకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం.. అసెంబ్లీ ఎన్నికల్లో అమలు

Vote From Home In Assembly Elections: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటినవారు ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సమాచారం అందిస్తూ..  ఇంటి నుంచే ఓటు వేయాలనుకునే వారు ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఎలక్షన్స్ నిర్వహించాల్సిన విషయం తెలిసిందే.

పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులు ఎవరు..? అనే విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్రం ఎన్నికల సంఘం సమాచారాన్ని పంపించింది. 80 ఏళ్లు దాటిన వృద్ధులతోపాటు, దివ్యాంగులు కూడా ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయం కల్పించింది. అదేవిధంగా కేంద్ర బలగాల్లో పనిచేస్తున్న సిబ్బంది, ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది, పోలింగ్ ఏజెంట్లు, ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపింది. మొత్తం 11 కేటగిరీల వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటు అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక రంగులో బ్యాలెట్‌ పత్రాన్ని రూపొందించనుంది ఎన్నికల సంఘం.

అయితే పోస్టల్ బ్యాలెట్ ద్వార ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే వారు ముందుగా రాత పూర్వకంగా ఆ ప్రాంత ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకోవాలని ఓ ఉన్నతాధికారి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని.. దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి ఎన్నికల సంఘం అధికారులు వెళ్లి ఏర్పాట్లు చేస్తారని చెప్పారు. కర్ణాటకల అసెంబ్లీ ఎన్నికలు, మునుగోడు, నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్‌లో కూడా ఈ విధానాన్ని ఎన్నికల సంఘం అమలు చేసిన విషయం తెలిసిందే. వచ్చే నెల ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను విడుదల చేసిన తరువాత అర్హులు ఎవరో వెల్లడికానుంది.

Also Read: Bigg Boss Season 7 Telugu: ఛీఛీ రతిక కూడానా.. ప్రిన్స్ యావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బ్యూటీ   

Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News