గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు యధావిధిగా ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభకు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 

Updated: Jan 20, 2019, 11:48 AM IST
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు యధావిధిగా ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభకు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అలాగే శాసనమండలిలో చైర్మన్ స్వామిగౌడ్ సమావేశాలకు అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం ఉభయ సభలు వేర్వేరుగా తీర్మానం చేయనున్నాయి. అంతకన్నా ముందుగా శాసనసభలో నేడు సండ్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.