CM KCR Yadadri Tour: యాదాద్రిలో తెలంగాణ సీఎం పర్యటన... ప్రెసిడెన్షియల్ సూట్స్ ప్రారంభించిన కేసీఆర్..

CM Kcr: సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు.  ఈ సందర్భంగా కేసీఆర్ ప్రెసిడెన్షియల్‌ సూట్స్, వీవీఐపీ కాటేజెస్‌ను ప్రారంభించారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2022, 07:05 PM IST
 CM KCR Yadadri Tour: యాదాద్రిలో తెలంగాణ సీఎం పర్యటన... ప్రెసిడెన్షియల్ సూట్స్ ప్రారంభించిన కేసీఆర్..

CM Kcr Yadadri Tour: తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రిలో (Yadadri) పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన.. వీఐపీల విడిది కోసం నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్స్ (Precidential suit) ప్రారంభించారు.ఈ సూట్ ను అత్యాధునిక సదుపాయాలతో 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు  జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీఎం యాగశాలను పరిశీలించటంతోపాటు భువనగిరి కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు. 

అంతేకాకుండాతెరాస జిల్లా కార్యాలయం ప్రారంభించటంతోపాటు రాయగిరిలో జరిగే బహిరంగసభలో ప్రసంగించనున్నారు కేసీఆర్ (CM KCR). సీఎం పర్యటన దృష్ట్యా యాదాద్రి భువనగిరిలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.  కలెక్టరేట్ ప్రారంభం అనంతరంఅధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా యాదగిరిగుట్టలో దుకాణాలు మూసివేయనున్నారు. 

భువనగిరిలో సీఎం సభ నేపథ్యంలో వలిగొండలో డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను స్టేషన్ కు తరలిస్తుండగా కాంగ్రెస్ నేతలు పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. నాయకులను తప్పించి..అనిల్ కుమార్ ను ఠాణాకు తరలించారు అధికారులు. 

Also Read: Medaram Jatara: మేడారం జాతరకు హెలికాప్టర్ లో వెళ్లొద్దామా..! పూర్తి వివరాలివిగో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News