హైదారాబాద్: పెట్రో ధరలు రోజు రోజుకు పెరుగుతూ ..క్రమంగా ఆకాశానంటుకోవడంతో జనాల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో వ్యక్తమౌతోంది. ఎన్నికల తరుణంలో ఈ అంశం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. ప్రచారంలో దీన్ని ప్రధానంశంగా చేర్చి విమర్శలు సంధిస్తున్నాయి. ఈ క్రమంలో పెట్రో ధరలపై ప్రభుత్వాల తీరుపై దుమ్మతిపోసిన టి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... తాము అధికారంలోకి రాగానే పెట్రో ధరలు తగ్గిస్తామని ప్రకటించారు. పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగిస్తామన్నారు.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అటు దేశంలో బీజేపీ సర్కార్ పై..ఇటు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని దయ్యబట్టారు. తెలంగాణలో పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని.. సర్వేల రిపోర్టే ఇందుకు నిదర్శనమన్నారు.పలువురు తెలంగాణ ఉద్యమకారులు పీసీసీ చీఫ్ సమక్షంలో కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు హామీ ఇచ్చారు.