Electric Autos To Women: మహిళలకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు త్వరలో పంపిణీ చేయాలని కృషి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించింది. కేవలం ఆధార్ కార్డుతో ఉచిత జిరో బస్ టిక్కెట్‌ను జారీ చేస్తుంది. ఆ తర్వాత అర్హులైన మహిళలందరికీ రూ. 500 గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. ఇక త్వరలో వారికి రూ.2500 ప్రతి నెలా అందించాలని కూడా యోచిస్తున్న సంగతి తెలిసింది. దీనికి ఇంకా పూర్తి విధివిధానాలపై కసరత్తు చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. మరోవైపు 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంటును కూడా అందిస్తోంది.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఉన్న మహిళలకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయాలని శ్రీకారం చుట్టుంది. దీన్ని నిన్న పైలట్ ప్రాజెక్టు కింద జనగామ పాలకుర్తిలో ప్రారంభించారు. ముఖ్యగా పొదుపు సంగంలో ఉండే మహిళలు లేదా ఆమె కుటుంబ సభ్యులు ఎవరికైనా వాహన లైసెన్సు కలిగి ఉంటే చాలు వారికి ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయాలని శ్రీకారం చుట్టింది. శ్రీనిధి పథకంలో భాగంగా ఈ ఆటోల పంపిణీని అమలు చేయాలని యోచిస్తోంది.
ఇదీ చదవండి: 70 ఏళ్లు పైబడినవారు కూడా ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి.. పూర్తి వివరాలు ఇవే..
అంటే శ్రీనిధి రుణంలో మహిళలు ఇక ఆటోలు కొనుగోటు చేయవచ్చు. దీన్ని వడ్డితో పాటు నిర్ణీత వ్యవధిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మహిళల సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రస్తుతం ఛార్జీంగ్ పాయింట్ల కోసం అధ్యయనం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీనిధి పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో ఉన్న మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి, మహిళల సాధికారతకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. తెలంగాణలో 56 లక్షల మంది మహిళలు ఈ శ్రీనిధి పథకంలో సభ్యులుగా ఉన్నారు.
ఇదీ చదవండి: మగువా ఓ మగువా సీరియల్ చెంచలమ్మ.. రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారో తెలుసా? పిక్స్ వైరల్ ..
ముఖ్యంగా మహిళలు ఇంటి వద్ద ఉంటూ అతిక తక్కువ వడ్డీకి రుణాలు పొందుతూ పనిచేసుకోవడానికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ శ్రీనిధి పథకంలో రూ.3 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. ముఖ్యంగా పౌల్ట్రీ, చిన్నచిన్న షాపులు, పాడిపశువులు, ఇప్పుడు కొత్తగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రారంభించిన ఎలక్ట్రిక్ ఆటోలు అతి తక్కువకే ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తూ రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా చేయూత అందించడానికి కృషి చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.