Congress MLA Sridhar Babu tests COVID-19 positive: హైదరాబాద్: తెలంగాణ (Telangana) లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో ఇటు అధికార పార్టీ టీఆర్‌ఎస్ (TRS) తోపాటు.. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ (Congress ) కు చెందిన మరో ఎమ్మెల్యే సైతం కరోనా బారిన పడ్డారు. పెద్దపల్లి జిల్లా మంథని (Manthani) ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu ) కు కరోనా పాజటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని శ్రీధర్ బాబు స్వయంగా బుధవారం రాత్రి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
I, along with my security personnel, Mr. S. Srinivas, have tested positive for COVID -19.
*I'm doing fine and currently under quarantine and so is Mr. S. Srinivas*. I request all those, who were in touch with me recently, *to get tested, follow the laid down protocols.— Sridhar Babu Duddilla (@OffDSB) November 4, 2020
తనతోపాటు తన సెక్యూరిటీ సిబ్బంది అయిన శ్రీనివాస్‌కు కూడా వైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరం కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నామని.. తన ఆరోగ్యం బాగానే ఉందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అయితే.. ఇటీవల శ్రీనివాస్‌తోపాటు తనను కలిసిన వారందరూ.. కోవిడ్ 19 మార్గదర్శకాల ప్రకారం కరోనా పరీక్షలు చేయించుకోవాలని శ్రీధర్ బాబు సూచించారు. Also read: TRP scam: టెలివిజన్ రేటింగ్స్‌పై కమిటీ ఏర్పాటు
ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో బుధవారం ( నవంబరు 4 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,539 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా ఐదుగురు (5) మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,45,682 కి చేరగా.. మరణాల సంఖ్య 1,362 కి పెరిగింది.
Also read: Pawan Kalyan: జనసేనానీ మెట్రో ప్రయాణం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe