Telangana Covid-19: కొత్తగా 894 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం వేయికి పైగా నమోదైన కేసులు కాస్త.. గురువారం 900లకు చేరువలో నమోదయ్యాయి. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతూనే ఉంది.

Last Updated : Nov 20, 2020, 09:54 AM IST
Telangana Covid-19: కొత్తగా 894 కరోనా కేసులు

Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం వేయికి పైగా నమోదైన కేసులు కాస్త.. గురువారం 900లకు చేరువలో నమోదయ్యాయి. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ( నవంబరు 19న ) రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా  కొత్తగా 894 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నలుగురు (4) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,61,728 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,423 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Good News: ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరం సీఈవో పూనావాలా

అయితే గత 24 గంటల్లో కరోనా నుంచి 1,057 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా (Telangana) కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,47,790 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 12,515 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.67 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. Also read: Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

ఇదిలావుంటే.. గురువారం తెలంగాణ వ్యాప్తంగా 39,448 కరోనా పరీక్షలు జరిపారు. వీటితో కలిపి నవంబరు 19వ తేదీ వరకు మొత్తం 50,50,612 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  హైదరాబాద్ పరిధిలో 154 కేసులు నమోదయ్యాయి.

telangana corona cases bulletin

Trending News