Dussehra Holidays: ఈనెల 26 నుంచే దసరా సెలవులు.. టీచర్లు పండగ చేసుకోండి..!

Dussehra Holidays: తెలంగాణలో దసరా సెలవులపై నెలకొన్న గందరగోళానికి తెర పడింది. సెలవును కుదించారని వచ్చిన వార్తలపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే సెలవులు ఉంటాయని తెలిపింది.

Written by - Srisailam | Last Updated : Sep 21, 2022, 02:51 PM IST
  • దసరా సెలవుపై విద్యాశాఖ క్లారిటీ
  • ఈనెల 26 నుంచే సెలవులు
  • SCERT ప్రతిపాదనలకు నో
 Dussehra Holidays: ఈనెల 26 నుంచే దసరా సెలవులు.. టీచర్లు పండగ చేసుకోండి..!

Dussehra Holidays: తెలంగాణలో దసరా సెలవులపై నెలకొన్న గందరగోళానికి తెర పడింది. సెలవును కుదించారని వచ్చిన వార్తలపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే సెలవులు ఉంటాయని తెలిపింది. ఈనెల 26 నుంచి దసరా సెలవులు మొదలు కానున్నాయి. అక్టోబర్ 8వరకు ఉంటాయి.


దసరా సెలవులను ఖరారు చేస్తూ రెండు రోజుల క్రితమే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ప్రకటన చేసింది. సద్దుల బతుకమ్మ రోజు నుంచి అనగా ఈనెల 26 నుంచి సెలవులు ప్రకటించింది. 14 రోజల సెలవుల తర్వాత అక్టోబర్ 8 వరకు కొనసాగునున్నాయి. అయితే దసరా సెలవులను తగ్గించాలని  రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(SCERT)  డైరెక్టర్ రాధారెడ్డి.. పాఠశాల విద్యా శాఖకు  ఓ లేఖ రాశారు. ఇప్పటికే  భారీ వర్షాల కారణంగా జూలైలో  11వ తేదీ నుండి 16వ తేదీ వరకు సెలవులు ఇచ్చారని తన లేఖలో తెలిపింది. సెప్టెంబర్ 17వ తేదీన జాతీయ సమైక్యత దినం సందర్భంగా సెలవు ఇచ్చారని.. దీంతో ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే ఏడు సెలవులు ప్రకటించారని తన లేఖలో వివరించారు రాధారెడ్డి. దసరాకు 14 రోజులకు బదులుగా 9 రోజులే సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ సూచించింది.

భారీ వర్షాలు, జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సెలవులు భర్తీ చేసేందుకు ఎస్‌సీఈఆర్‌టీ మరో ప్రతిపాదన కూడా చేసింది.  నవంబరు నుంచి ఏప్రిల్ వరకు రెండో శనివారాలు కూడా స్కూళ్లు నడపాలనిపాఠశాల విద్యాశాఖకు సూచించింది. SCERT ప్రతిపాదనను తెలంగాణ విద్యాశాఖ సీరియస్ గా పరిశీలిస్తోందని.. సెలవులను తగ్గించనుందని వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ 26 నుంచి కాకుండా అక్టోబర్ 1 నుంచి దసరా సెలవులు ఇవ్వనున్నారనే ప్రచారం సాగింది. దీంతో దసరా సెలవులపై తీవ్ర గందరగోళం నెలకొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఊర్లకు వెళ్లడానికి టికెట్లు బుక్ చేసుకున్న టీచర్లు, విద్యార్థులు పరేషాన్ అయ్యారు. అయితే తాజాగా సెలవులపై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ విద్యాశాఖ.

Also read: తెలుగు యాంకర్ ను ఆడుకున్న గౌతమ్ మీనన్..డౌట్ రాకుండా సీరియస్ కౌంటర్!

Also read:  Anchor Lasya Pregnancy: మళ్లీ తల్లవుతున్నా అంటూ అభిమానులకు లాస్య గుడ్ న్యూస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News