Formula E Car Case: ఫార్ములా ఈ కారు రేసింగ్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఊహించినట్టే బీఆర్ఎస్ నేత కేటీఆర్ మెడకు చుట్టుకుంటోంది. తాజాగా ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసి జనవరి 7న విచారణకు హాజరు కావల్సిందిగా కోరింది. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు రావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణలో ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసు సంచలనం రేపుతోంది. ఈ కేసులో ముందు నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపింది. జనవరి 7వ తేదీన విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. కేటీఆర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారిక అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ ఛీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు అందించింది. ఈ ఇద్దరూ జనవరి 2,3 తేదీల్లో విచారణకు హాజరుకావల్సి ఉంటుంది.
ఫార్ములా ఈ కేరు రేసింగ్ కేసులో తెలంగాణలోని ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది. పెమా నిబంధనల్ని ఉల్లంఘించినట్టు ఈడీ అధికారులు ప్రాధమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 31 వరకూ అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.
Also read: SBI PO Jobs: నిరుద్యోగులకు శుభవార్త, ఎస్బీఐలో భారీగా పీవో పోస్టుల భర్తీ, ఎలా అప్లై చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.