హైదరాబాద్: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ, శాసనమండలిలోనూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్లో భాగంగా అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి జాతీయ జెండా ఎగురవేయగా మరోవైపు శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ జెండా ఎగురవేశారు. అనంతరం గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతితో పాటు సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ప్రముఖులు ఆకాంక్షించారు.