రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విడత డీఏ (కరువు భత్యం) ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Last Updated : Sep 3, 2018, 05:11 PM IST
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విడత డీఏ (కరువు భత్యం) ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ఇందుకు సంబంధించిన ఫైలుపై  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతకం చేశారు. 1.572 శాతం డీఏ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి పెరిగిన డీఏ వర్తిస్తుంది. తాజా పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ మొత్తం 27.24 శాతానికి చేరుకుంది.

ఈ ఏడాది మేలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 1.572 శాతం డీఏను పెంచుతూ.. పెంచిన డీఏ జులై 1, 2017 నుంచి వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మరో విడత డీఏ కూడా రావాల్సి ఉండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈరోజు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

అలాగే  రాష్ట్రంలో ఉన్న ఎంపీడీవోలకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. ఎంపీడీవోలకు సంబంధించిన పదోన్నతుల ఫైలుపై కేసీఆర్ సంతకం చేశారు. దీంతో రాష్ట్రంలో ఉన్న 130 మందికి పైగా ఎంపీడీవోలు పదోన్నతులు పొందనున్నారు. 21 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎంపీడీవోలు ఎదురుచూస్తున్నారు. పదోన్నతుల కోరిక నెరవేర్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఎంపీడీవోలు కృతజ్ఞతలు తెలిపారు.

Trending News