పరిషత్‌ పోరులో కారు జోరు ; చతికిల పడ్డ హస్తం,కమలం పార్టీలు

తెలంగాణ పరిషత్‌ ఎన్నికల్లోనూ గులాబీదళం దాదాపు ఏక పక్ష విజయాన్ని సొంతం చేసుకుంది.

Last Updated : Jun 4, 2019, 09:26 PM IST
పరిషత్‌ పోరులో కారు జోరు ; చతికిల పడ్డ హస్తం,కమలం పార్టీలు

తెలంగాణ పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా జోరుగా వీచింది. సింహ భాగం స్థానాలను కైవసం చేసుకొని  గులాబీ దళం సత్తా చాటింది. హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగ్గా.. అన్ని జిల్లాల్లోనూ కారు జోరు సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 534 జడ్పీటీసీ, 5 వేల 659 ఎంపీటీసీ  స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఇందులో టీఆర్ఎస్ 445 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 3 వేల 556 ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకుంది. 
చతికీలపడ్డ హస్తం, కమలం పార్టీలు
లోక్ సభ ఎన్నికల్లో పుంజుకున్నట్లు కనిపించిన కాంగ్రెస్, కమలం పార్టీలు పరిషత్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయాయి. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే  77 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 1377 ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకొని రెండో స్థానంలో నిలిచి పరువు నిలుపుకుంది. ఇక కమలం పార్టీ కేలవం 8 జెట్పీటీసీ స్థానాలతో పాటు 211 ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకొని మూడో స్థానంలో నిలిచింది. 

ఎక్కడా ప్రభావం చూపని టీడీపీ
ఇదిలా ఉండగా నామామాత్రంగా బరిలోకి దిగిన టీడీపీకి ఎక్కడా జెడ్పీటీసీ స్థానాలు దక్కలేదు.. అయితే 21 ఎంపీటీసీ స్థానాలు మాత్రం పొందింది. ఇతరులు మాత్రం 5 జడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకోగా.. 573 ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకున్నారు

Trending News