Minister Harish Rao: తెలంగాణలో కేంద్రమంత్రి అమిత్ షా టూర్ సెగలు తగడం లేదు. తుక్కుగూడ సభ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. మరోసారి అమిత్ షా అసత్య ప్రచారం చేశారని మండిపడుతున్నారు. తాజాగా బీజేపీ, అమిత్ షాకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా కాదు..అబద్ధాల షా అంటూ మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఆయన జూటా మాటలు చెప్పి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది గుజరాత్ కాదని..తెలంగాణ ప్రజలు అమాయకులు కాదన్నారు. ఉద్యమించి సాధించుకున్న గడ్డ ..తెలంగాణ అని చెప్పారు. ఇక్కడ అమిత్ షా అబద్ధాలు నడవని..తెలంగాణ విశ్వసించరని మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దుకు మద్దుతు ఇవ్వలేదని అసత్య ప్రచారం చేశారన్నారు. మిషన్ భగీరథకు 2 వేల 500 కోట్లు ఇచ్చారని చెబుతున్నారు..కానీ వాస్తవానికి రెండు రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ఖర్చులతో పథకం అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
తెలంగాణలో గతేడాది నుంచి ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2 వేల 679 కోట్లతో మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. దీనిపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. 8 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమి లేదని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. కృష్ణ జలాల విషయంలోనూ తమ గోడును పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని తమ ప్రభుత్వమే తీసుకుంటోందని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు. తెలంగాణకు 7 వేల 183 కోట్ల బకాయిలు ఇవ్వాలని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ రేటు 7.11 శాతానికి పెరిగిందన్నారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాష్ట్రానికి ఇస్తామన్న బయ్యారం రైల్వే, ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏమయ్యిందని ప్రశ్నించారు. విభజన హామీలను ఒక్కటైనా అమలు చేశారా అని హరీష్‌రావు మండిపడ్డారు. రైతు వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని..రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. మొత్తంగా అగ్ర నేతల రాకతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది.
Also read:Ys Sharmila comments: రైతులను చంపిన చరిత్ర బీజేపీది..వైఎస్ షర్మిల ఫైర్..!
Also read:Flipkart Offer: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. రూ.20 వేలు విలువ చేసే ఈ టీవీ కేవలం రూ.499కే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.