'అధికారం కన్నా.. ప్రజాశక్తే గొప్పది'- ఇది పూర్తిగా రైతుల విజయం!

Telangana ministers on New Farm laws repeal: నూతన సాగు చట్టాలను స్వాగతిస్తున్నట్లు తెలంగాణ మంత్రులు, ఇతర నేతలు ప్రకటించారు. ఇది రైతుల విజయమని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్​కు భయపడే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని చెప్పారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2021, 04:30 PM IST
  • సాగు చట్టాల ఉపసంహరణపై తెలంగాణ మంత్రుల హర్షం
  • ప్రజాశక్తి అధికారం కన్నా గొప్పదన్న కేటీఆర్​
  • కేంద్రానికి రైతు పోరాట రుచి చూపించారని హరీశ్​రావు ట్వీట్​
  • కేసీఆర్​కు క్రెడిట్ ఇవ్వడంపై టీపీసీసీ అధ్యక్షుడు అభ్యంతరం
'అధికారం కన్నా.. ప్రజాశక్తే గొప్పది'- ఇది పూర్తిగా రైతుల విజయం!

Telangana ministers on New Farm laws repeal: మూడు నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ(Modi on New farm Laws repeal) ప్రకటించగా.. దీనిని దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పార్టీలు ఆహ్వానించాయి. తెలంగాణ మంత్రులు, ఇతర లీడర్లు కూడా కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ప్రజా శక్తే ఎప్పుడూ గొప్పది..

అధికారంలో ఉన్న నేతలకన్నా.. ప్రజా శక్తి ఎప్పుడూ గొప్పదేనని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని (KTR on New farm Laws repeal) వ్యక్తపరిచారు.

అలుపెరుగన పోరాటంతో అనుకున్నది సాధించొచ్చని భారత రైతులు మరోసారి నిరూపించారని కేటీఆర్ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ఇది రైతు విజయం..

రైతులను ముంచేలా కేంద్ర ప్రభుత్వం చేసిన నల్ల రైతు చట్టాలనకు వ్యతిరేకంగా.. బుల్లెట్లు, లాఠీలు, పోలీసు కంచెలకు ఎదురెళ్లి రైతులు విజయం సాధిచారని తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి టి.హరీశ్​రావు (Harishrao on New farm Laws repeal) పేర్కొన్నారు.

రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి.. రైతుల శక్తి, పోరాట రుచిని కేంద్రానికి రుచి చూపించారన్నారు హరీశ్​రావు.

Also read: 'సాగు చట్టాల రద్దు ముమ్మాటికి రైతులు, ప్రజాస్వామ్యం సాధించిన విజయమే'..!

ముందే నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది..

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం సంతోషకరమైదని పేర్కొన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి. అయితే దీనిపై ఆలస్యంగా స్పందించిందని (S.Niranjan Reddy on New farm Laws repeal) పేర్కొన్నారాయన. ఈ కారణంగా పలువురు ప్రణాలు పొగట్టుకున్నారని తెలిపారు. ఊ ఉద్యమంలో ప్రణాలు కోల్పోయిన రైతులకు కన్నీటి వీడ్కోలు ప్రకటించారు.

Also read: సాగు చట్టాల రద్దుపై స్పందించిన కంగనా, సోనూసూద్ పలువురు సినీ ప్రముఖులు

విద్యుత్ చట్టాలను కూడా ఉపసంహరించుకోవాలి..

సాగు చట్టాల ఉపసంహరణ రైతుల విజయమని అభివర్ణించిన తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి.. విద్యుత్ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాణ పోరాడతామని కేసీఆర్ ప్రకటించడంతో.. కేంద్రం భయపడి వివాదాస్పద చట్టాల రద్దు నిర్ణయంపై కేంద్రం నిర్ణయం తీసుకుందని తాము భావిస్తున్నట్లు (Jagdih Reddy on New farm Laws repeal) తెలిపారు.

అయితే టీఆర్​ఎస్ పోరాటం ఇంతటితో ఆగదని.. రైతులకు పూర్తి స్థాయి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు జగదీశ్​.

Also read: తమిళనాడు: భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు...నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి..

కేసీఆర్​కు క్రెడిట్ ఇవ్వడంపై రేవంత్ అభ్యంతరం..

ఉత్తర్​ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేంద్రం రైతు చట్టాలపై వెనక్కి తగ్గిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ ముందు నుంచి మద్దతు ఉస్తూనే ఉందని (MP Revanth Reddy on New farm Laws repeal) స్పష్టం చేశారు.

అయితే సాగు చట్టాల రద్దు ఘనతను కేసీఆర్​కు ఇవ్వడాన్ని ఆయన తప్పు బట్టారు. రైతు చట్టాలకు అనుకూలంగా టీఆర్ఎస్​ ఎంపీలు ఓటేశారని ఆరోపించారు. కేసీఆర్​కు క్రెడిట్ ఇవ్వడం రైతులను అవమానించడమేనన్నారు. ఇది ముమ్మాటికి రైతులు సాధించిన విజయమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రైతు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన రాకేశ్ టికాయిత్ సహా ఉద్యమంలో పాల్గొన్న రైతులందరికి శుభాకాంక్షలు తెలిపారు.

Also read: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి... ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం...

Also read: ప్రేమోన్మాది దాడిలో 18 కత్తిపోట్లకు గురైన యువతి... మృత్యువును జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News