తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల

Last Updated : May 13, 2019, 04:24 PM IST
తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. నిన్న ఆదివారం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఇవాళ ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి ఈ ఫలితాలను వెల్లడించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 3 వరకు జరిగిన ఈ పరీక్షలకు 11వేలకు పైగా పాఠశాలలకు చెందిన 5,06,200 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ బిసి సంక్షేమ గురుకుల పాఠశాలలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు చేసుకోవడం విశేషం. 10వ తరగతి ఫలితాల్లో 99.73% ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా మూడోసారి జగిత్యాల జిల్లా మొదటి ర్యాంక్ సొంతం చేసుకోవడం మరో విశేషం.

93.88 % ఉత్తీర్ణతతో బాలికలు పైచేయి సాధించారు
91.18% ఉత్తీర్ణత సాధించిన బాలురు
99.73% ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచిన జగిత్యాల జిల్లా
83.09% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచిన హైదరాబాద్ జిల్లా

Trending News