TS TET 2022: జూలై 1న తెలంగాణ టెట్ ఫలితాలు.. ఫైనల్ కీ పై క్లారిటీ ఇవ్వని సబితా ఇంద్రారెడ్డి

TS TET 2022: తెలంగాణ టెట్ ఫలితాలపై నెలకొన్న గందరగోళంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. జూలై 1న టెట్ ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు. మంగళవారం తన కార్యాలయంలో మంత్రి  విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

Written by - Srisailam | Last Updated : Jun 28, 2022, 07:51 PM IST
  • జూలై1న తెలంగాణ టెట్ ఫలితాలు
  • అధికారులతో మంత్రి సబిత సమీక్ష
  • ఇంకా విడుదల కానీ టెట్ ఫైనల్ కీ
TS TET 2022: జూలై 1న తెలంగాణ టెట్ ఫలితాలు.. ఫైనల్ కీ పై క్లారిటీ ఇవ్వని సబితా ఇంద్రారెడ్డి

TS TET 2022: తెలంగాణ టెట్ ఫలితాలపై నెలకొన్న గందరగోళంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. జూలై 1న టెట్ ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు. మంగళవారం తన కార్యాలయంలో మంత్రి  విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, టెట్ కన్వీర్ రాధారెడ్డి పాల్గొన్నారు. టెట్ ఫలితాలపై సమీక్షించిన సబితా ఇంద్రారెడ్డి.. జూలై1న ఫలితాలు విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఈసారి ఫలితాల వెల్లడిలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

టెట్ నోటిఫికేషన్ సమయంలోనే జూన్ 27న ఫలితాలు వెల్లడిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాని ఫలితాలు రాలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే అభ్యర్థులు టీచర్ రిక్రూట్ మెంట్ కు అర్హులు. టెట్ రిజల్ట్ వస్తేనే డీఎస్సీ లేదా టీఆర్టీకి ప్రిపేర్ అవుతారు. అందుకే టెట్ రాసిన అభ్యర్థులంతా ఫలితాల కోసం ఎదరుచూస్తున్నారు. టెట్ పరీక్షకు సంబంధించి ఇంకా ఫైనల్ కీ కూడా రాలేదు.షెడ్యూల్ ప్రకారం ఫలితాలు రాకపోవడం, అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అభ్యర్థులు కలవరపడ్డారు. ఈ నేపథ్యంలోనే అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సబితా ఫలితాల విడుదల తేదీని ప్రకటించారు.

టెట్ ఫలితాల విడుదల తేదీని ప్రకటించిన మంత్రి.. ఫైనల్ కీ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇది కూడా ఇప్పుడు గందరగోళానికి దారి తీస్తోంది. జూన్ 12న టెట్ పరీక్ష జరిగింది.  ఉదయం పేపర్ 1.. మధ్యాహ్నాం పేపర్ 2 నిర్వహించారు. జూన్ 15  న ప్రాథమిక కీ వచ్చింది. 18 వ తేదీ వరకు ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరించారు. టెట్ పరీక్షా పేపర్లలో చాలా తప్పులు దొర్లాయి. దీంతో అభ్యర్థుల నుంచి భారీగానే అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పరిశీలించి తుది కీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫైనల్ కీ వచ్చాకే ఫలితాలు విడుదల చేస్తారు. కానిఇప్పటి వరకూ టెట్ ఫైనల్  కీ  విడుదల చేయలేదు.ప్రాథమిక కీ టెట్ పేపర్ 1 లో 5  సమాధానాలపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పేపర్ 2 లోని ఫైనల్ కీ 5 సమాధానాల్లోనూ తప్పులు ఉన్నాయని చెబుతున్నారు.ఈ మార్పులు చేశాకే ఫైనల్ కీ విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Read also : PV JAYANTHI: పీవీని కేసీఆర్ వాడుకుని వదిలేశారా! జయంతి వేడుకలకు ఎందుకు హాజరుకాలేదు?    

Read also : ఇంటర్‌లో ఫెయిల్ అయినా, తక్కువ మార్కులు వచ్చినా.. టెన్షన్ అవసరం లేదు! ఇలా చేస్తే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News