Telangana Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికితోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగనున్నాయి. మరో రెండ్రోజులు తెలంగాణలో వర్షాలు పడవచ్చు. హైదరాబాద్‌కు మాత్రం హై అలర్ట్ జారీ అయింది.
తెలంగాణను భారీ వర్షాలు ఇంకా వీడేట్టు కన్పించడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌కు ఇవాళ రాత్రి హై అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రాత్రి 7 గంటల్నించి 10 గంటల వరకూ భారీ వర్షం పడనుందని ఐఎండీ తెలిపింది. నగరంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో ఐటీ కారిడార్‌లో ఆగస్టు 1 వరకూ లాగౌట్ పొడిగించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా 3 షిఫ్టుల్లో పనివేళలుండాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్ సహా యాదాద్రి, మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కరీంనగర్, వనపర్తి జిల్లాలకు సైతం అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో మరో మూడ్రోజులు పరిస్థితి ఇలాగే ఉండనుందని తెలుస్తోంది.
కాగా ఇవాళ ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాల పరిధిలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. వరంగల్ జిల్లాలో భారీవర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొత్తగూడెంలో పుణ్యపువాగు రోడ్లపై ప్రవహిస్తోంది. ఫలితంగా కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నెరసారి వాగు ఉధృతితో ప్రవహిస్తుండటంతో మరి కొన్నిగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇవాళ, రేపు ఖమ్మం, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. భారీ వర్షాల హెచ్చరికల నేపధ్యంలో తెలంగాణ ఛీప్ సెక్రటరీ శాంతికుమారి అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిలిచిపోకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
ప్రస్తుతానికి ఏపీ, ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాత్రికి వాయుగుండంగా మారనుంది. దీనికితోడు మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ, రేపు అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. వరద ఉధృతి కారణంగా మూసీ నదిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
Also read: Telangana Rains: తెలంగాణలో వరుణుడి బీభత్సం.. భారీగా పంట నష్టం.. ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook