Telangana Weather Update: ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

Orange Alert for Telangana: రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటివేళ బయటకు రావాలంటే జంకుతున్నారు. తెలంగాణలో పలు జిల్లాలో రానున్న మూడు రోజులు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.

Written by - Ashok Krindinti | Last Updated : Jun 20, 2023, 07:22 PM IST
Telangana Weather Update: ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

IMD Warns Orange Alert to Telangana 3 Districts: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు రాగల 2,3 రోజులలో ద్వీపకల్ప దక్షిణ భారతదేశంలోని మరికొన్ని భాగాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య /పశ్చిమ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు  తేలికపాటి నుంచి మోస్తారు  వర్షాలు అక్కడక్కడ  కురిసే అవకాశం ఉందన్నారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో  కూడిన వర్షాలు కూడా కురుస్తాయని తెలిపారు. 

అదేవిధంగా రానున్న మూడు రోజులు అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే నేడు, రేపు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో వడ గాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఎల్లుండి ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ వడ గాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు.

Also Read: Vijay Speech: ఓటుకు నోటుపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు.. రాజకీయ రంగ ప్రవేశానికి రెడీ..?

ఆంధ్రప్రదేశ్‌లో 109 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు నేడు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. అల్లూరి 9, అనకాపల్లి 6, బాపట్ల 8, తూర్పు గోదావరి 17, ఏలూరు 12, గుంటూరు 9, కాకినాడ 18, కోనసీమ 7, కృష్ణా 15, మన్యం 5, పశ్చిమ గోదావరి జిల్లాలోని 3 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

మరోవైపు వర్షాల కోసం రెండు రాష్ట్రాల్లో రైతులు ఎదురుచూస్తున్నారు. భూములు దుక్కిదున్ని విత్తుకు రెడీ చేసుకుని వరుణుడు కోసం ప్రార్థిస్తున్నారు. వర్షాలు కురిస్తే.. సాగు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు బిపర్ జోయ్ తుఫాన్ గుజరాత్‌లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు అక్కడ భారీ వృక్షాలు కూలిపోగా.. విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.

Also Read: Adipurush Controversy: ఆదిపురుష్‌పై వివాదం.. దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని డిమాండ్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News