Fuel Shortage: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేనేలేదని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని.. నిరంతరాయంగా సరఫరా జరుగుతుందన్నారు. పెట్రోల్ డీజిల్ కొరతపై సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా మంత్రి గంగుల సమీక్ష చేశారు. సివిల్ సప్లైస్ కార్యాలయంలో హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు సమీక్షలో పాల్గొన్నారు. అనవసర పుకార్లకు ప్రజలెవ్వరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు గంగుల. వాహనదారులు ఎంత పెట్రోల్, డీజిల్ అయినా పోయించుకోవచ్చని చెప్పారు. వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
నేడు హైదరాబాద్ లోని నా కార్యాలయంలో ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది
👉 రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేనే లేదు. ప్రజలెవరూ పుకార్లను నమ్మెద్దు, భయాందోళనలకు గురికావద్దు. pic.twitter.com/AMfnrlm5lN
— Gangula Kamalakar (@GKamalakarTRS) June 7, 2022
ఆర్టీసీ సంస్థల బస్సులు కూడా రిటైల్ బంకుల నుంచే డీజిల్ ను వాడుకుంటున్నాయని చెప్పారు. అందువల్ల బంకుల్లో త్వరత్వరగా స్టాక్స్ అయిపోతున్నాయని వీటిపై పౌరసరఫరాలశాఖ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ కొరత లేకుండా చూస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కంపెనీలవి కలిపి 3520 బంకులు ఉన్నాయని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 480 బంకుల్లోనూ నిరంతరాయంగా పెట్రోల్, డీజిల్ సరఫరా కొనసాగిస్తున్నామని చెప్పారు. 807 ఎల్పీజీ ఔట్ లెట్లలో సైతం కావాల్సినంత స్టాక్ ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజు మాదిరిగా ఉండేవిదంగానే పెట్రోల్ 38 వేల 571 కిలో లీటర్లు, డీజిల్ 23 వేల 875 కిలో లీటర్లు ఉందని గంగుల చెప్పారు. స్టాక్ పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడూ పెట్రోల్, డీజిల్ రాష్ట్రానికి వస్తూనే ఉందన్నారు. డీలర్లు కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు తీసుకున్నామన్న గంగుల.. అలా ఎవరైనా చేస్తే ఉపేక్షించామన్నారు. వాళ్ల లైసెన్సులు రద్దీ చేయడానికి సైతం వెనుకాడమన్నారు మంత్రి గంగుల.
Also Read: Railway Luggage Rules: రైల్వే లగేజ్ రూల్స్ మారాయా ? రైల్వే శాఖ స్పష్టత
Also Read: Priyanka Chopra Pics: హద్దులు దాటేసిన ప్రియాంక చోప్రా అందాల ప్రదర్శన.. ఇలా ఎప్పుడూ చూసుండరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Fuel Shortage: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత, మంత్రి ఏమన్నారంటే..?
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు
ప్రజలు పుకార్లు నమ్మొద్దని మంత్రి గంగుల విజ్ఞప్తి
డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు