Bandi Sanjay: మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు వేళాయే..షెడ్యూల్ ఇదే..!

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. చారిత్రాక, తెలంగాణ సాయుధ, ఉద్యమ పోరాటాల నేపథ్య ప్రాంతాల మీదుగా పాదయాత్ర సాగనుంది.

Written by - Alla Swamy | Last Updated : Jul 23, 2022, 06:45 PM IST
  • బండి సంజయ్ పాదయాత్ర సర్వం సిద్ధం
  • మూడో విడత షెడ్యూల్ విడుదల
  • ప్రకటించిన బీజేపీ నేతలు
Bandi Sanjay: మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు వేళాయే..షెడ్యూల్ ఇదే..!

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత పాదయాత్రకు షెడ్యూల్ ఖరారైంది. వచ్చేనెల 2 నుంచి 26 వరకు ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత సాగనుంది. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుంచి ప్రారంభమయ్యే యాత్ర హన్మకొండ భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు కొనసాగుతుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. 

మొత్తం 24 రోజులపాటు యాదాద్రి, నల్గొండ, జనగామ, వరంగల్, హన్మకొండ జిల్లాల మీదుగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మండలాల్లో సాగనుంది. మొత్తం 328 కిలోమీటర్ల మేర మూడో విడత పాదయాత్ర కొనసాగుతుంది. ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్, జనగామ, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగుతుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. 

ఎన్నో చారిత్రాక ప్రదేశాల గుండా పాదయాత్ర సాగనుంది. చేనేత ప్రసిద్ధి గాంచిన పోచంపల్లి, రజకార్ల అరాచకాలకు బలైన గుండ్రాంపల్లి, చాకల ఐలమ్మ పోరు సాగించిన విసునూరు, సర్వాయి పాపన్న పాలనా రాజధాని కిలాషపూర్, కొత్తపేట, ఐనవోలు మల్లన్న ఆలయా ప్రదేశాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. అనేక గిరిజన తండాల మీదుగా పాదయాత్ర వెళ్లనుంది.

గత రెండు పాదయాత్రలు విజయవంతంగా ముగిశాయి. ఈక్రమంలో మూడో దశ యాత్ర సక్సెస్ చేసేందుకు పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. మొదటి విడత పాదయాత్ర హైదరాబాద్ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి రెండో దశ యాత్ర జోగులాంబ గుడి నుంచి ప్రారంభమైంది. ఈసారి యాదాద్రి ఆలయం నుంచి మూడో విడత పాదయాత్ర ప్రారంభంకానుంది. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించనున్నారు.

Also read:Rahul Gandhi on NDA: ఎన్డీఏ అంటే నో డేటా అవలైబుల్..కేంద్రంపై రాహుల్ గాంధీ సెటైర్లు..!

Also read:CM Kcr Review: తెలంగాణలో రెయిన్ అలర్ట్..అప్రమత్తంగా ఉండాలన్న సీఎం కేసీఆర్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News