V Hanumantha Rao slams CM KCR over Jobs Notification in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 80,039 ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్పందించారు. నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేశారని అన్నారు. ఓట్ల కోసమే ఈ స్టంట్ అని పేర్కొన్నారు. ఉద్యోగాల ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని, అయితే గతంలో హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
గత కొన్నేళ్లుగా నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే సీఎం కేసీఆర్ ఈరోజు ఉద్యోగ ప్రకటన చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వ్యాఖ్యానించారు. ఉద్యోగాల ప్రకటనను తాము స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక్క కేసీఆర్ వల్లే రాలేదని, అందరి త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని వీహెచ్ అభిప్రాయపడ్డారు.
ఆర్టికల్ 3 వల్ల తెలంగాణ వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారు కాబట్టే.. ఈరోజు ఉద్యోగాల ప్రకటన చేశారని ఆరోపించారు. ఎస్సి, ఎస్టీ,బీసీల గురించి కాంగ్రెస్ ఎన్నో ఏళ్ల నుండి పోరాడితేనే ఇప్పుడు ప్రభుత్వం 49 సంవత్సరాల వయో పరిమితిని పెంచిందని వీహెచ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ... 'రాత్రి నుంచి వేచి చూసాను, ఉదయం కూడా టీవీ చూసాను. ఉద్యోగులకు మంచి వార్తే అందింది. అయితే ఓట్ల కోసమే ఈ ప్రకటన అని చెప్పొచ్చు. 2018 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి అన్నారు అది ఏమైంది. హుజారాబాద్ ఎన్నికల సమయంలో అన్ని ఖాళీలు భర్తీ చేస్తా అన్నారు. ఇప్పుడైనా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఆర్థిక పరిస్థితి భాగలేదు. అందుకే నిరుద్యోగ బృతి ఇవ్వలేమని చెప్పిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలి' అని అన్నారు.
Also Read: Devineni Uma Arrest: వరుసగా రెండో రోజు ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమ హౌస్ అరెస్టు.. కారణమిదే!
Also Read: Telangana Jobs: తెలంగాణలో ఉద్యోగాల జాతర.. జిల్లాల వారిగా ఖాళీ వివరాలు ఇవే! అత్యధికంగా హైదరాబాద్‌లో!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook