Thummala Nageswara Rao Politics: పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే సామెతను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అక్షరాల పాటిస్తున్నారు. గత ఎన్నికలలో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుండి ఓటమి చెందిన తుమ్మల నాగేశ్వర రావు మళ్లీ అదే స్థానం నుండి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల పరిణామాల నేపాథ్యంలో దూరం అయిన క్యాడర్‌ను తిరిగి దగ్గర చేసుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డితోనూ సన్నిహితంగా ఉన్న మరి కొంతమంది కూడా తుమ్మల నాగేశ్వర రావుకే మద్దతు పలకడంతో నియోజకవర్గంలో ఈ మాజీ మంత్రి స్పీడ్ పెంచారు.
తుమ్మల నాగేశ్వర రావు ఈపేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. టీడీపి అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మం ఉమ్మడి జిల్లాను కంటిచూపుతో శాసించారు. టీడీపీ హయంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వర రావు జిల్లాను అభివృద్ది చేశారన్న పేరుంది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుతో తుమ్మల టీఆర్ఎస్‌లో చేరారు. సీఎంతో ఉన్న సన్నిహితం, అపర రాజకీయ అనుభవంతో తుమ్మలను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. ఆ తరువాత రెండేళ్ళ తరువాత అప్పటి పాలేరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా దిగంగత నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి హఠాన్మరణం చెందారు. దీంతో పాలేరులో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల బరిలో నిలిచి విజయం సాధించారు.
మూడేళ్ళు మంత్రిగా పనిచేసిన తుమ్మల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. అదే సమయంలో తుమ్మల నాగేశ్వర రావు ఎప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉండడు అనే మాట కూడా ప్రచారంలో ఉంది. ఎవరిని కూడా లెక్కచేయని తత్వం తుమ్మలది అని చెప్పుకుంటారు. దురుసుగా కూడా ప్రవర్తిస్తాడని కిందిస్థాయి నాయకులు చర్చించుకుంటారు. ఈప్రవర్తనతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ అనుభవం లేని కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో తుమ్మల ఘోర పరాభవం చవిచూసారు. అనంతరం కాంగ్రెస్ నుండి గెలిచిన కందాల కొన్నేళ్లకే అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో పాలేరులో మాజీ మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే కందాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపించాయి.
గత నాలుగు సంవత్సరాలుగా పాలేరును అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఎలాంటి కృషి చేయలేదని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉన్న, ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదంటా.. మరొవైపు తుమ్మల నాగేశ్వర రావు నుండి దూరం అయ్యి, కందాలతో నడుస్తున్న వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇవ్వడం లేదట. దీంతో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వ్యవహరశైలి, తమప్రాంతాలను అభివృద్ధి చేసుకోలేకపోతున్నామనే ఆవేదన వారిలో ఉంది. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వర రావు నుండి దూరం అయిన వారంతా మళ్లీ మాజీ మంత్రి వెంట నడుస్తున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో జరుగుతున్న పలు కార్యక్రమాలకు స్వయంగా తుమ్మలను ఆహ్వానిస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు. దీంతో తుమ్మల జోష్ మీద ఉన్నారు. ప్రతి రోజు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గతానికి భిన్నంగా ఉంటూ ప్రజలతో అపాయ్యంగా తుమ్మల మెలుగుతున్నారు.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా తానే బరిలో నిలుస్తానని తుమ్మల ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. సీఎం కేసీఆర్‌తో, తుమ్మల నాగేశ్వర్ రావుకు ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. పాలేరు నియోజకవర్గంలో తన కళ్ల ముందే జరుగుతున్న పరిణామాలను ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాత్రం నిశితంగా పరిశీలిస్తున్నారు. దీంతో పాలేరులో ఎవరిదిపైచేయి అవుతుంది.. తమ పరిస్థితి ఏంటి అని టీఆర్ఎస్ క్యాడర్ సైతం ఎదురుచూస్తోంది.
Also Read : Revanth Reddy: మోదీ ఇచ్చిన సుపారీతోనే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలు: రేవంత్‌రెడ్డి..!
Also Read : CM Kcr: జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారా..? కుమారస్వామితో మంతనాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి