Telangana Bypoll Elections Result 2022: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. మొత్తం 15 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. మునుగోడులో మొత్తం 241805 ఓట్లర్లు ఉండగా.. 225192 మంది ఓటేశారు. మరో 658 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Congress candidate Palvai Sramwanti Fake News: తాను సీఎం కేసీఆర్‌ను కలిసానని తనపై వస్తున్న ఫేక్ వార్తలపై మునుగోడు కాంగ్రెస్ అభ్తర్థి పాల్వాయి స్రంవంతి ఈసీకి ఫిర్యాదు చేశారు, ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
Revanth Reddy: 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేయడమే కాంగ్రెస్ చేసిన నేరమా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.పోరాటాల చరిత్రకు వారసులమైన మనం బాంఛన్ దొరా అని బానిసలవుదామా.. లే నిప్పుకణికలై నిటారుగా నిలబడి కొట్లాడుదామో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
Munugode Bypoll : మునుగోడు ఎన్నికల్లో ప్రధాన పార్టీలు తమ తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక పాల్వాయి స్రవంతి కాన్వాయిని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు.
Munugode Bypoll: మూడు ప్రచారాలు.. ఆరు గొడవలు.. అన్నట్లుగా తయారైంది మునుగోడు నియోజకవర్గం. ఉప ఎన్నికల ప్రచారంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీల కార్యకర్తలు గొడవలకు దిగుతున్నారు. పరస్పరం దాడులకు సిద్ధమవుతున్నారు.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై హైకమాండ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోకపోతే మార్చేస్తామని రేవంత్ ను హెచ్చరించారని తెలుస్తోంది.
Palvai Sravanthi: మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ వేసేందుకు సిద్దమైంది. కాంగ్రెస్ కార్యాలయం దగ్దమైన ఘటనతో పాల్వాయి స్రవంతి రోడ్డుపై బైటాయించిన సంగతి తెలిసిందే. ఆమె ఈ నెల 14న నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు.
Munugode: కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్ రేవంత్‌ను పక్కన పెడుతోందా..? మునుగోడు పార్టీ అభ్యర్థి విషయంలో ఎవరి పంతం నెగ్గింది. చల్లమల్ల కృష్ణారెడ్డికి కాకుండా పాల్వాయి స్రవంతికి ఇవ్వడానికి గల కారణాలేంటి..? తాజాగా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం..
Munugode: తెలంగాణ రాజకీయాలన్నీ మునుగోడు చూట్టూ తిరుగుతున్నాయి. త్వరలో ఆ స్థానానికి ఉప ఎన్నిక రానుంది. దీంతో పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది.
Congress Candidate in Munugode By Election : మునుగోడు ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతికే టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
Munugode Bypoll : తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి.తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసిన ప్రియాంక గాంధీ.. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెలంగాణ పీసీసీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Munugode Bypoll: కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న రేవంత్ రెడ్డి.. శనివారం నుంచి మునుగోడు నియోజకతవర్గంలో పర్యటించనున్నారు. ప్రతి గ్రామం తిరిగేలా రేవంత్ రెడ్డి రూట్ మ్యాప్ సిద్దమైంది. మునుగోడులో సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
Revanth Reddy: తెలంగాణ రాజకీయ భవిష్యత్ పరిణామాలకు కేంద్రంగా మారబోతోంది మునుగోడు ఉప ఎన్నిక. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప సమరం.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కి పెద్ద తలనొప్పిగా మారింది.
Munugode Byelection: తెలంగాణలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీల పోటాపోటీ వ్యూహాలతో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనుండంతో ఆ పార్టీ అభ్యర్థిగా ఆయనే ఉండనున్నారు.
Munugode Byelection: మునుగోడు కాంగ్రెస్ లో టికెట్ లొల్లి తీవ్రంగా ఉంది. మునుగోడు నుంచి పాల్వాయి స్రవంతితో పాటు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఇటీవలే పార్టీలో చేరిన చెరకు సుధాకర్ గౌడ్ , జర్నలిస్ట్ సంఘం నేత పల్లె రవికుమార్ గౌడ్ స ఉస్మానియా ఉద్యమకారుడు పున్న కైలాస్ నేతతో పాటు బడా కాంట్రాక్టర్ చల్లమల్లా కృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
Munugode Byelection: తెలంగాణ రాజకీయాలన్నీ మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న ఈ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నాయి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.