Revanth Reddy: ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయండి..కేసీఆర్‌కు రేవంత్ లేఖాస్త్రం..!

Revanth Reddy: తెలంగాణలో రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈక్రమంలోనే తాజాగా సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి లేఖాస్త్రం సంధించారు.

Written by - Alla Swamy | Last Updated : Jun 22, 2022, 04:07 PM IST
  • తెలంగాణలో పొలిటికల్ వార్
  • అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం
  • తాజాగా సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ లేఖ
Revanth Reddy: ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయండి..కేసీఆర్‌కు రేవంత్ లేఖాస్త్రం..!

Revanth Reddy: తెలంగాణలో రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈక్రమంలోనే తాజాగా సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి లేఖాస్త్రం సంధించారు. హోంగార్డులు, మోడల్ స్కూల్ సిబ్బందికి వెంటనే జీతాలు  చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణను అప్పుల ఊబిల్లోకి నెట్టేలా చేశారని మండిపడ్డారు. 8 ఏళ్ల పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందని మండి పడ్డారు.

ఇటు ప్రజలపై పలు రకాల పన్నుల భారం మోపుతున్నారని విమర్శించారు. భూముల అమ్మకం, పెట్రోల్ ధరల వ్యాట్‌, భూముల రిజిస్ట్రేషన్‌ ఛార్జీల రూపంలో వస్తున్న డబ్బు ఎటుపోతోందని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం అంటూ పక్క రాష్ట్రాలకు వెళ్లి డబ్బులు పంచుతున్నారని ఫైర్ అయ్యారు. అర్ధరాత్రులు రోడ్లపై పనిచేసే హోంగార్డులకు జీతాలు ఇవ్వలేరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జూన్‌ నెల ముగుస్తున్నా..ఇంత వరకు వారికి మే నెల జీతాలు అందలేదని..దీనికి కారణాలు ఏంటో ప్రభుత్వమే చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అదే సమయంలో మోడల్ స్కూళ్లలో పనిచేసే టీచింగ్-నాన్ టీచింగ్ సిబ్బందికి జీతాలు అందని పరిస్థితి నెలకొందన్నారు. తొలకరి మొదలై..వానాకాలం వచ్చినా..అన్నదాతలకు రైతు బంధు విడుదల కాలేదని ఫైర్ అయ్యారు.

ఆర్థిక మంత్రి హరీష్‌రావు సైతం సమీక్షలు చేసే పరిస్థితి లేదని..కేవలం రాజకీయ ప్రేలాపనలకు కోరస్ పాడే పనిలో ఉన్నారని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పుతోందన్నారు రేవంత్‌రెడ్డి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దల విలాసాలు, జల్సాలు, రాజకీయ విన్యాసాలు ఆపి చిరు ఉద్యోగులకు జీతాలు చెల్లించాలన్నారు.

Also read: Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్‌..సీఎం ఠాక్రేకు పాజిటివ్..ఏం జరగబోతోంది..!

Also read:AP Govt: ఏపీలో రైతులకు శుభవార్త..పంటల బీమా పరిహారం అందని వారికి మరోసారి ఛాన్స్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News