TRS Corporator Attack: కారుతో బైకులను ఢీకొట్టి.. ప్రశ్నించిన ఆడవాళ్లపై దాడి! టీఆర్ఎస్ కార్పొరేటర్ దౌర్జన్యం..

TRS Corporator Attack: అతనో ప్రజా ప్రతినిధి.. అయినా చిల్లరగా వ్యవహరించాడు.నడిరోడ్డుపై వీరంగం వేశాడు. అధికార మదంతో దౌర్జన్యానికి పాల్పడ్డాడు.ఓవర్ స్పీడ్‌ తో కారు నడిపి ప్రమాదం చేశాడు. దానిపై ప్రశ్నించిన మహిళలపైనా దాడికి దిగాడు.

Written by - Srisailam | Last Updated : Jun 11, 2022, 11:25 AM IST
  • గోదావరి ఖనిలో రెచ్చిపోయిన టీఆర్ఎస్ కార్పొరేటర్
  • తన కారుతో బైకులను ఢీకొట్టిన కార్పొరేటర్
  • ప్రశ్నించిన స్థానిక మహిళలపై దాడి
TRS Corporator Attack: కారుతో బైకులను ఢీకొట్టి.. ప్రశ్నించిన ఆడవాళ్లపై దాడి! టీఆర్ఎస్ కార్పొరేటర్ దౌర్జన్యం..

TRS Corporator Attack: అతనో ప్రజా ప్రతినిధి.. అయినా చిల్లరగా వ్యవహరించాడు. నడిరోడ్డుపై వీరంగం వేశాడు. అధికార మదంతో దౌర్జన్యానికి పాల్పడ్డాడు.ఓవర్ స్పీడ్‌ తో కారు నడిపి ప్రమాదం చేశాడు. దానిపై ప్రశ్నించిన మహిళలపైనా దాడికి దిగాడు. తనకు ఓటేసి గెలిపించిన ప్రజలను నానా బూతులు తిట్టాడు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ కార్పొరేటర్ దాడికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వివరాల్లోకి వెళితే గోదావరి ఖని ఉదయ్ నగర్ లో ఇంటి ముందు పార్క్ చేసిన మోటర్ సైకిళ్లను రామగుండం కార్పొరేషన్ 10వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య తన కారుతో ఢీ కొట్టాడు. ఇదేంటని ప్రశ్నించి ఇంటి యాజమాని చందుపట్ల వేణుగోపాల్ రెడ్డిపై దాడి చేశాడు. కార్పొరేటరే దాడికి దిగడంతో అతని అనుచరులు మరింతగా రెచ్చిపోయారు. వేణుగోపాల్ రెడ్డి భార్య ప్రమిద కుమారిని చితకబాదారు మాజీ కార్పోరేటర్ ధరణీ జలపతి, టిబిజికెఎస్ నాయకుడు పోలాడి శ్రీనివాస్ రావు, జువ్వాడి వెంకట్. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన జర్నలిస్ట్ కుమార్ ను కొట్టారు. సిఐటియు నాయకుడు మెండ శ్రీనివాస్ పైనా దాడికి పాల్పడ్డారు కార్పొరేటర్ తో పాటు అతని అనుచరులు. మద్యం మత్తులో ఉన్న నలుగురు ఇంట్లోకి చొరబడి బూతులు తిడుతూ బీభత్సం స్పష్టించారు.

కార్పొరేటర్ దాడిపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితా పోలీసులు వచ్చినా కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య అనుచరులు వీరంగం వేశారు. పోలీసుల ముందే దాడికి యత్నించారు. ఈ ఘటనలో వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు గాయపడ్డారు. బాధితులను పోలీసులు వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ కు చెందిన మరో కార్పొరేటర్ అదే కాలనీ లో పోచమ్మ వైన్స్ పై దాడి చేసి ఇద్దరిని చితక బాదాడు.  మద్యం ఉచితంగా ఇవ్వాలంటూ కౌంటర్ పై ఉన్నవారిపై దాడి చేశాడు టీఆర్ఎస్ కార్పొరేటర్. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Read also: ROJA COMMENTS: జెండా పీకేయడం ఖాయం.. పవన్ కల్యాణ్, అచ్చెన్నపై రోజా హాట్ కామెంట్స్

Read also: Covid-19 Fourth Wave: దేశంలో కొవిడ్ కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు.. ఫోర్త్ వేవ్ అలర్ట్?   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News