MLC Kavitha: ఆ మాటలు నన్ను బాధించాయి.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha On Bandi Sanjay: బతుకమ్మ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ఎక్కడానికి తన 12 ఏళ్ల కష్టం ఉందని.. ఆనాడు బతుకమ్మ ఎత్తుకోవడానికి భయపడ్డ వాళ్లు ఇవాళ బతుకమ్మను అవమానిస్తున్నాని ఆవేదన వ్యక్తం చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2022, 01:37 PM IST
MLC Kavitha: ఆ మాటలు నన్ను బాధించాయి.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha On Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన మీద మాట్లాడిన మాటలు బాధించాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రధాని మోదీ నుంచి బండి సంజయ్ వరకు అందరు మహిళల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలే వాటిని తిప్పికొడుతారని అన్నారు. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆమె బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. బీజేపీ వాళ్లకు  కళ్లు మూసినా తెరిచిన సీఎం కేసీఆర్ కనిపిస్తున్నాడరని అన్నారు. 

'బతుకమ్మ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బతుకమ్మ ఎత్తుకోవడానికి భయపడ్డ వాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారు. బండి సంజయ్ మాటలు నన్ను మాత్రమే అవమానించలేదు. బతుకమ్మను అవమానించారు. బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ఎక్కడానికి నా 12 ఏళ్ల కష్టం ఉంది. ఆనాడు బతుకమ్మ ఎత్తుకోవడానికి భయపడ్డ వాళ్లు ఇవాళ బతుకమ్మను అవమానిస్తున్నారు. బీఆర్ఎస్ వల్ల బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్ అయింది. 

'మోదీ మమతా బెనర్జీని.. బండి సంజయ్ నన్ను అవహేళన చేశారు. కాంగ్రెస్‌కు దింపుడు కళ్లెం ఆశలున్నాయి. బీఆర్ఎస్‌కు దైవశక్తి అవసరం.. కాబట్టే యాగాలు చేస్తున్నాం. రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్‌లో చాలా రాష్ట్రాల నుంచి చేరికలు ఉంటాయి. నిర్మలా సీతారామన్ వీక్ హిందీ గురించి కాకుండా వీక్ రూపి గురించి స్పందిస్తే బాగుండు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకుంటుందే నిర్మలా సీతారామన్.. భాషపై దృష్టి కాకుండా ప్రజల సమస్యపై మా దృష్టి.. బీజేపీ కూడా ప్రజల సమస్యపై దృష్టి పెట్టాలి. బీఆర్ఎస్.. టీఆర్ఎస్‌ అనేది కాదు.. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు..' అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

తెలంగాణ అనే పదాన్ని పలకడానికి భయపడే సమయంలో కేసీఆర్ పోరాటం చేశారని గుర్తు చేశారు. జాగృతి ఎప్పుడూ సైలెంట్‌గా లేదని.. సమయాన్ని బట్టి తమ పంథాను మార్చుకుంటూ వచ్చామన్నారు కవిత. 

మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమె చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. 160 సీఆర్పీసీ కింద విచారణ ముగిసిందో లేదో.. 91 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే దాదాపు 7 గంటలు విచారించిన సీబీఐ అధికారులు ఢిల్లీ బయలుదేరి వెళ్లిపోయారు. అవసరమైతే మరోసారి విచారిస్తామని చెప్పడంతో ఈసారి కవిత అరెస్ట్ తప్పదని ప్రచారం జరుగుతోంది. 

Also Read: RBI Penalty On Banks: 13 బ్యాంక్‌లకు షాకిచ్చిన ఆర్బీఐ.. ఆ తప్పుకు భారీ జరిమానా  

Also Read: Home Loan Repayment: ఇంటి రుణం చెల్లింపు భారం కాకుండా ఉండాలంటే ఇలా చేయండి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x