RBI Penalty On Banks: 13 బ్యాంక్‌లకు షాకిచ్చిన ఆర్బీఐ.. ఆ తప్పుకు భారీ జరిమానా

Reserve Bank Of India: దేశంలో నిబంధనలు ఉల్లంఘించిన 13 బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకుల్లో మీకు కూడా ఖాతా ఉంటే చెక్ చేసుకోండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2022, 12:11 PM IST
  • 13 బ్యాంకులపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం
  • భారీ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటన
  • కస్టమర్ల ఆర్థిక లావాదేవీలపై ప్రభావం చూపిస్తుందా..?
RBI Penalty On Banks: 13 బ్యాంక్‌లకు షాకిచ్చిన ఆర్బీఐ.. ఆ తప్పుకు భారీ జరిమానా

Reserve Bank Of India: దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీబిఐ) పలు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే 13 బ్యాంకులపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 13 సహకార బ్యాంకులపై జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ బ్యాంకుల్లో మీకు కూడా ఖాతా ఉంటే.. ఫైన్ మీరు కూడా చెల్లించాలా..? ఇంతకు ఆర్బీఐ జరిమానా విధించిన జాబితాలో ఏయే బ్యాంకుల పేర్లు ఉన్నాయి..?
 
వివిధ నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందున 13 బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ బ్యాంకులకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు జరిమానా విధించారు. శ్రీ కన్యకా నగరి సహకారి బ్యాంక్, చంద్రపూర్‌కు అత్యధికంగా జరిమానా విధించింది. ఈ బ్యాంకుపై ఆర్బీఐ 4 లక్షల జరిమానా వేసింది. 
వైద్యనాథ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ బీడ్‌పై కూడా ఆర్బీఐ రూ.2.50 లక్షల జరిమానా విధించింది. 

వీటితోపాటు వై అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, సతారా, ఇండోర్ ప్రీమియర్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై కూడా ఆర్‌బీఐ ఒక్కొక్కటికి రూ.2 లక్షల ఫైన్ వేసింది. అదేసమయంలో.. మేఘాలయలోని పటాన్ నాగ్రిక్ సహకారి బ్యాంక్, తురా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై కూడా రూ.1.50 లక్షల జరిమానా పడింది. 

ఈ బ్యాంకులే కాకుండా.. నాగ్రిక్ సహకరి బ్యాంక్ మర్యాడిట్, జగదల్పూర్; జిజౌ కమర్షియల్ కోఆపరేటివ్ బ్యాంక్, అమరావతి; తూర్పు, ఈశాన్య సరిహద్దు రైల్వే కో-ఆప్ బ్యాంక్, కోల్‌కతా; డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్, ఛతర్పూర్; నాగ్రిక్ సహకారి బ్యాంక్ మర్యాడిట్, రాయ్‌ఘర్; జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్, బిలాస్పూర్; జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ మర్యాడిట్, షాడోల్‌లకు కూడా ఆర్బీఐ భారీగా జరిమానా విధించింది. అయితే ఈ బ్యాంకులకు ఆర్భీఐ జరిమానా విధించినా కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపించదు. కస్టమర్లు జరిపే లావాదేవీలకు ఈ జరిమానాకు ఎలాంటి సంబంధం లేదని ఆర్బీఐ తెలిపింది. 

Also Read: VK Naresh Defamation Case : యూట్యూబ్‌ ఛానళ్లపై కేస్.. ట్రోల్స్ మీద పవిత్ర-నరేశ్‌ యుద్దం

Also Read: India China Face-off: భారత్-చైనా సైన్యం మధ్య హింసాత్మక ఘర్షణ.. మరికాసేపట్లో రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News