Kavitha-Tamilisai: శంషాబాద్ బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత.. గవర్నర్ తమిళిసైని చూసి షాక్!

TRS MLC Kavitha meets Governor Tamilisai at Shamshabad Bathukamma Festival Celebrations. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే గవర్నర్ తమిళిసై పూజకు వెళ్లడంతో.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  

Written by - P Sampath Kumar | Last Updated : Sep 30, 2022, 08:06 PM IST
  • తమిళిసైని చూసి షాక్ అయిన ఎమ్మెల్సీ కవిత
  • ముందస్తు సమాచారం ఇవ్వకుండా..
  • రాష్ట్ర వ్యాప్తంగా 'బతుకమ్మ' వేడుకలు
Kavitha-Tamilisai: శంషాబాద్ బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత.. గవర్నర్ తమిళిసైని చూసి షాక్!

TRS MLC Kavitha shock after see Governor Tamilisai Soundararajan: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 'బతుకమ్మ' వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ శోభ ఉట్టి పడుతోంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుగొమ్మగా నిలిచిన ఈ వేడుకలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం శంషాబాద్ అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయంలో నిర్వహించారు. 

అమ్మపల్లి రామాలయంలో అమెరికన్ కాన్సులెట్ జెన్నీఫర్ లార్డాన్, ఎమ్మెల్సీ కవిత కలిసి బతుకమ్మను పేర్చారు. రంగురంగుల పూలతో చాలా అందంగా పేర్చారు. అనంతరం జాగృతి అధ్యక్షురాలు కవిత బతుకమ్మ పాట పాడుతుంటే.. అక్కడ ఉన్న మిగతా మహిళలు కోరస్ అందుకున్నారు. దాంతో రామాలయం మొత్తం సందడిగా మారింది. బతుకమ్మ సంబరాల అనంతరం ఎమ్మెల్సీ కవిత రామాలయంలోని దేవుడిని సందర్శించారు. 

ఎమ్మెల్సీ కవిత రామాలయంలో ఉండగానే.. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రమంకు చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేరుగా గుడికి వెళ్లారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే గవర్నర్ పూజకు వెళ్లడంతో.. అక్కడి అధికారులు అవాక్కయ్యారు. అధికారులు గవర్నర్ తమిళిని గుడిలోపలోకి తీసుకెళ్లగా.. అక్కడే ఉన్న కవిత ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆపై ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. పూజ అనంతరం గవర్నర్ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: టీ20 ప్రపంచకప్ 2022లో ఆ రెండు జట్లే ఫెవరెట్.. షేన్ వాట్సన్ జోస్యం!

Also Read: క్యాన్సర్ పేషెంట్‌గా నటించడం సవాలుగా మారింది.. నియా త్రిపాఠి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News