20 ఏళ్ల క్రితం 'జలదృశ్యం'లో పురుడు పోసుకున్న తెలంగాణ ఉద్యమ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవాంతరాలు దాటుకుని .. లక్ష్యసాధన పూర్తి చేసింది.
ఎన్నో ఉద్యమాలు, పోరాటాలతో కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ సాధించింది. ఇప్పుడు ఆ పార్టీ నేటికి 20 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో వేడుకలు జరుపుకుంటోంది. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించేది లేదని తెలంగాణ ఉద్యమసారథి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు నేడు తెలంగాణ భవన్ లో అత్యంత నిరాడంబరంగా ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి.
సీఎం కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి.. తెలంగాణ తల్లికి వందనాలు చెప్పనున్నారు. ఈ క్రమంలో పార్టీలోని అతి కొద్ది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ రెండు దశాబ్దాల క్రమాన్ని వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసింది.
20 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో ఎన్నో ఘట్టాలు..#20YearsOfTRS #TRSFormationDay pic.twitter.com/2JvTI2CDSl
— TRS Party (@trspartyonline) April 27, 2020
అటు తెలంగాణ ఉద్యమానికి పిడికిలి బిగించి.. జంగు సైరన్లతో జైకొట్టిన ప్రతి ఒక్కరికీ వందనాలు అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నాటి 'జలదృశ్యం' నుంచి నేటి 'సుజల దృశ్యం' వరకు అంటూ ఓ ఫోటో పోస్టు చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు ఆవిర్బావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఒక్క పిడికిలి బిగిస్తే బిగుసుకున్నయ్ కోట్ల పిడికిల్లు
ఒక్క గొంతు జైకొడితే జంగు సైరనయ్యింది
స్పూర్తి ప్రదాతా వందనం ...ఉద్యమ సూర్యుడా వందనం 🙏
20 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యమ బిడ్డలందరికీ
ఆవిర్భావ దినోత్సావ శుభాకాంక్షలుజై తెలంగాణా ! జై జై KCR !!#20YearsOfTRS pic.twitter.com/KAU1smruhK
— KTR (@KTRTRS) April 27, 2020