Telangana EAMCET First Phase Counselling Date Released: తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. సోమవారం నుంచి జూలై 5వ తేదీ వరకు ఫీజు చెల్లించి.. స్లాట్ బుక్ చేసుకోవాలి. కౌన్సిలింగ్ స్లాట్ బుక్ చేసుకున్నవారు ఈ నెల 28వ తేదీ నుంచి జూలై 6వ తేదీలోపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా జూన్ 28వ తేదీ నుంచే వెబ్ ఆప్షన్ల నమోదు కూడా ప్రారంభం అవుతుంది. జూలై 8వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. అనంతరం జూలై 12న సీట్ల కేటాయింపు ఉంటుంది. జూలై 12 నుంచి 19వ తేదీ మధ్యలో విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న కాలేజీల్లో వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్ట్ చేయలి. ఎంసెట్ ఫలితాలు విడుదల అయినప్పటి నుంచి కౌన్సిలింగ్ కోసం విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జూలై 21వ తేదీ నుంచి 24వరకు రెండో విడత ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభంకానుంది. అదే నెల 28న సీట్లు కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 2వ తేదీన చివరి విడత కౌన్సిలింగ్ ఉంటుంది. అదే రోజు నుంచి 4వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు.. ఆగస్టు 7న సీట్ల కేటాయింపు ఉండనుంది. ఆగస్టు 7వ తేదీ నుంచి నుంచి 9వ తేదీ మధ్యలో కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులకు సమయం ఉంటుంది. చివరగా ఆగస్టు 8న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను అధికారులు రిలీజ్ చేస్తారు.
విద్యార్థులు టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు మొదటి దశగా కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు ఏదైనా బ్యాంకు క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ని ఉపయోగించి ఆన్లైన్ మోడ్‌లో ఫీజు చెల్లించవచ్చు. అన్రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులు రూ.1200, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి.
Also Read: YSR Law Nestham Scheme: గుడ్‌న్యూస్.. నేడే అకౌంట్లో రూ.25 వేలు జమ
ఇలా ఫీజు చెల్లించవచ్చు
==> టీఎస్ ఎంసెట్ అధికారిక వెబ్సైట్ TSeamcet.nic.in ఓపెన్ చేయండి
==> “ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు” లింక్‌పై క్లిక్ చేయండి
==> టీఎస్ ఎంసెట్ 2023 హాల్ టిక్కెట్ నంబర్, ర్యాంక్‌ను ఎంటర్ చేయండి
==> "ఫీజు చెల్లించండి" ఆప్షన్ క్లిక్ చేయండి
==> చెల్లింపు విధానాన్ని ఎంచుకోండి
==> క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ కోసం అవసరమైన ఆధారాలను నమోదు చేయండి
==> ఫీజు చెల్లించడానికి "చెల్లించు" ఆప్షన్‌పై క్లిక్ చేయండి
అవసరమైన పత్రాలు ఇవే..
==> TS EAMCET 2023 ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్
==> ఆధార్ కార్డ్
==> టెన్త్, ఇంటర్ మార్కు షీట్లు
==> చివరిగా చదివిన పాఠశాల నుంచి టీసీ
==> ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన మెమో-కమ్-పాస్ సర్టిఫికేట్
==> 2023 జనవరి 1 తరువాత జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం (వర్తిస్తే)
==> కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే)
==> స్థానికేతర అభ్యర్థుల విషయంలో 10 సంవత్సరాల పాటు తెలంగాణలో తల్లిదండ్రుల్లో ఎవరికైనా నివాస ధృవీకరణ పత్రం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి