TS Inter Result 2023: ఇంటర్ విద్యార్థుల అలెర్ట్‌, ఫలితాలు అప్పుడే!

TS Inter Result 2023: 2023 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ పరీక్షలను త్వరలో విద్యా శాఖ విడుదల చేయబోతునట్లు సమాచారం. ఇప్పటికే వాల్యుయేషన్‌ ప్రక్రియ కూడా చివరి దశలో ఉండడం వల్ల తర్వలోనే ఫలితాలు విడుదల చేయబోతున్నారని సమాచారం.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 4, 2023, 12:52 PM IST
TS Inter Result 2023: ఇంటర్ విద్యార్థుల అలెర్ట్‌,  ఫలితాలు అప్పుడే!

TS Inter Result 2023: తెలంగాణలో 10వతరగతి, ఇంటర్ పరీక్షలు పూర్తై..జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తి కావొస్తోంది. ఫలితాల విడుదలకు ఉన్నత అధికారులు కూడా కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఎంసెట్‌, నీట్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రవేశ పరీక్షలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఇంటర్‌ వాల్యుయేషన్‌ సంబంధించిన ప్రక్రియను పూర్తిచేశారని సమాచారం. ఈ ఫలితాలు ఇదే నెల మొదటి వారం లేదా రెండ వారం విడుదల చేయబోతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. 

Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం

ఈ సంవత్సరం ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ రెండు సంవత్సరాలు కలుపుకుని 9 లక్షల మంది విద్యార్థులు రాశారని విద్యా శాఖ పేర్కొంది. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం షెడ్యూలు ప్రకారం పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షలు మార్చి 15 ప్రారంభమై ఏప్రిల్‌ 4 వరకు జరిగాయి. అయితే ఈ పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్‌ 3వ తేదీ నుంచే 10వ తరగతి పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 11తో ముగిసాయి. అయితే వీటికి సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 

ఎంసెట్‌, నీట్‌, జేఈఈ పరీక్ష రాసిన విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా ఇంటర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ పలు ఏర్పాట్లు చేస్తోంది. ఇక టెన్త్‌ ఫలితాల విషయానికొస్తే మే 15 తేదిన విడుదల చేయబోతునట్లు అధికారిక సమాచారం. ఈ సంవత్సరం 4.8 లక్షల మంది విద్యార్థులకు పైగా టెన్త్‌ పరీక్ష రాశారని సమాచారం. అయితే ఈ రెండు పరీక్షల ఫలితాలపై త్వరలోనే స్పష్టత వచ్చే ఛాన్స్‌ ఉంది. 

Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News