ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్టుల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్షా తేదీలను రాష్ట్రస్థాయి పోలీసు నియామక సంస్థ ప్రకటించింది.

Last Updated : Jul 10, 2018, 09:13 AM IST
ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్టుల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్షా తేదీలను రాష్ట్రస్థాయి పోలీసు నియామక సంస్థ ప్రకటించింది. ఎస్ఐ ఉద్యోగాలకు ఆగస్టు 26వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. 1,271ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా 1,88,715 మంది దరఖాస్తు చేసుకున్నారు.

సెప్టెంబరు 2న ఉదయం ఉదయం గం. 10 నుంచి మధ్యాహ్నం గం. 1వరకు ఐటీ, కమ్యూనికేషన్స్ ఎస్ఐ, మధ్యాహ్నం గం. 2.30 నుంచి సాయంత్రం గం. 5 వరకు ఫ్రింగర్ ప్రింట్స్ బ్యూరో ఏఎస్ఐ నియామక అర్హత నిర్వహించనున్నట్లు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక సంస్థ ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఐటి విభాగంలో 29 ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించగా 13,944 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరోలో 26 ఎఎస్‌ఐ పోస్టుల కోసం దరఖాస్తుల ను ఆహ్వానించగా 7,700 మంది దరఖాస్తు చేసుకున్నారు.

సెప్టెంబరు 30న కానిస్టేబుళ్ల నియామక ప్రాథమిక పరీక్ష నిర్వహించనున్నారు. 16,925 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానించగా 4,79,166 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 10 ముఖ్యమైన ప్రాంతాల్లో జరపాలని బోర్డు నిర్ణయించింది. కమ్యూనికేషన్స్ ఎస్ఐ, ఫింగర్ ప్రింట్ ఏఎస్ఐ పరీక్ష మాత్రం హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఉంటుందని శ్రీనివాసరావు పేర్కొన్నారు.  దరఖాస్తుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. వ్యక్తిగత వివరాల్లో మార్పులను జూలై 14 వ తేదీ సాయంత్రం గం. 5 లోపల అప్‌ లోడ్‌ చేసి support@tsprb.inకు మెయిల్ ద్వారా పంపించాలని సూచించారు.

Trending News